తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలకు ఉన్న ఫాలోయింగ్ ఏ వేరు. స్టార్ హీరోల ఫ్యాన్స్ ఫాలోయింగ్ కి, మీడియం రేంజ్ హీరోల ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా వ్యత్యాసం ఉంటుంది. వీరికి ఎక్కడా కూడా పొంతన ఉండదు. అయితే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా మీడియం రేంజ్ హీరోలు కూడా క్లిక్ అయ్యారు. రీసెంట్ గా య్యూటూబ్ లో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం 100 మిలియన్స్ కిపైగా వీవర్ షిప్ ని దక్కించుకున్నాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు పోటీగా నితిన్ సినిమా విడుదల అయింది. ప్రస్తుతం ఏ సినిమాలు లేవు కదా.. థియేటర్లు కూడా ఓపెన్ కాలేదు.. మరీ ఏ సినిమాతో పోటీ చేస్తున్నారు అనేగా మీ ప్రశ్న. అయితే ప్రస్తుతం ఈ హీరోలు పోటీలో దిగింది బుల్లితెరపై..

టీవీల్లో చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలు అని తేడా ఉండదు. ఏ సినిమాలైనా బుల్లితెరపై మాత్రం రికార్డులు సృష్టిస్తాయి. ప్రస్తుతం పండగ సీజన్ లో టెలికాస్ట్ చేసే ప్రతి సినిమా భారీ టీ.ఆర్.పీని నమోదు చేసుకుంటాయి. ఈ లాక్ డౌన్ టైంలో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘అల వైకుంఠపురములో’ 29.4 టీ.ఆర్.పీ రేటింగ్ నమోదు చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా 23.4 టీ.ఆర్.పీ రేటింగ్ ను నమోదు చేసుకుంది. ఈ సినిమాలు బిగ్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు బుల్లితెరపై కూడా రికార్డు సృష్టించాయి.

అయితే ఈ ఏడాది నితిన్ రష్మికా మందనా హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం ‘భీష్మ’ సినిమా కూడా బిగ్ స్క్రీన్ లో మంచి హిట్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా బుల్లితెరపై కూడా రిలీజ్ అయింది. దసరా కానుకగా ‘భీష్మ’ ప్రీమియర్ షోగా జీతెలుగు అక్టోబర్ 25వ తేదీన టెలికాస్ట్ చేసింది. అదృష్టవశాత్తు మిగిలిన చానళ్లలో మరో పెద్ద సినిమా టెలికాస్ట్ కాలేదు. దీంతో బుల్లితెరలో కూడా ‘భీష్మ’ మంచి సక్సెస్ ను దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: