తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కొంతమంది వచ్చి సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయి  ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటే.. మరి కొంతమంది హీరోయిన్లు సినిమాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్నప్పటికీ సరైన అవకాశాలు అందుకోలేక కనుమరుగు అవుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు బెంగాలీ బ్యూటీ రచన బెనర్జీ. నేను ప్రేమిస్తున్నాను అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ... మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జె.డి.చక్రవర్తి హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.



 ఇక ఈ సినిమాలో కేవలం నటనతోనే కాదు తన అందాల ఆరబోతతో కూడా తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది బెంగాలీ బ్యూటీ రచన బెనర్జీ. ఇక ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ బావగారు బాగున్నారా అనే సినిమాలో నటించి మంచి బ్రేక్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కూడా నటించి ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నది  ఈ ముద్దుగుమ్మ. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఒక్కసారిగా తెలుగు తెరపై కనుమరుగైపోయింది రచన బెనర్జీ.



 దీంతో అభిమానులు కూడా ఆందోళనలో మునిగిపోయారు  స్టార్ హీరోయిన్ గా ఉన్న రచన ఒక్కసారిగా కనుమరుగై పోవడానికి కారణం ఏంటి అని అర్థం కాక నిరాశలో మునిగిపోయారు అభిమానులు. రచన బెనర్జీ సినిమాలకు దూరం కావడానికి కారణం ఆమె చెడు అలవాటే అని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్గా మంచి ఫామ్లో కొనసాగుతున్న సమయంలో రచన బెనర్జీ సిగరెట్లు మద్యానికి బానిసగా మారిందని.. ఈ క్రమంలోనే అవకాశాలు తగ్గి డిప్రెషన్కు లోనవడంతో ఆమె పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెకు  నచ్చజెప్పి పెళ్లి చేసినట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు పెళ్లి తరువాత అడపాదడపా సినిమాల్లో నటించింది రచన బెనర్జీ.

మరింత సమాచారం తెలుసుకోండి: