టాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి ఆ తర్వాత రాజకీయాలకే పరిమితం అయిన పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీ ఎంట్రీలో మరింత జోష్ గా  ముందుకు సాగుతున్నారు పవన్  కళ్యాణ్. వరుస  సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ఓవైపు రాజకీయాల్లో కొనసాగుతూనే  మరోవైపు వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా గురించి అటు అభిమానులు అందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్  సాబ్  లో నటిస్తూనే మరోవైపు మరో మూడు సినిమాలను కూడా లైన్ లో పెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.



 ఇక అంతలోనే దసరా సందర్భంగా మరో కొత్త సినిమాపై కూడా షాకింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్. తెలుగు సినిమా అభిమాన పోలీస్ ఇస్ బ్యాక్ ఇన్ హై ఓల్టేజ్ రోల్ అంటూ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఈ పండక్కి పవన్ అభిమానులు అందరూ పండగ చేసుకున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్మాణసంస్థ వెల్లడించలేదు... కాగా  ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర టాక్ మొదలైపోయింది.



 మలయాళం సూపర్ హిట్ మూవీ  రీమేక్ గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకి ఒక ఆసక్తికర టైటిల్ కూడా పెట్టబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది 1982లో చిరంజీవి మోహన్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా టైటిల్ పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. ఇందులో బిల్లా పాత్రలో పవన్ కళ్యాణ్... రంగా పాత్రలో రానా  నటించనున్నారని టాలీవుడ్ లో ప్రచారం ఊపందుకుంది. దీంతోపవన్ కళ్యాణ్ తన తర్వాతి సినిమా కు చిరంజీవి టైటిల్ ఫిక్స్ అయిపోయినట్టు  అటు అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: