టాలీవుడ్  ఇండస్ట్రీలో ఉన్న  మెగా ఫాన్స్, నందమూరి ఫాన్స్ మధ్యన తరాల నుండి వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ అదే మెగా హీరో - నందమూరి హీరో కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు అని తెలియగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇటు తారక్, చెర్రీ లు కూడా మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అదే ఫ్రెండ్ షిప్ ని సినిమాలో వాడేయాలని రాజమౌళి డిసైడ్ అయి rrr సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ లోను, అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ లోను  రాజమౌళి rrr లో ఏ హీరోకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇస్తాడు, ఏ హీరోకి స్క్రీన్ స్పేస్ తక్కువ ఇస్తాడు.  

ఇక రామ్ చరణ్ కేరెక్టర్ కన్నా ఎన్టీఆర్ కేరెక్టర్ ఎక్కువ ఉంటే?ఎన్టీఆర్ భీం కేరెక్టర్ కన్నా చరణ్ అల్లూరి పాత్ర ఎక్కువ ఉంటే? ఇలా ఏదో ఒక విషయంలో ఏదో ఒక అనుమానం.అయితే మార్చ్ లో చరణ్ బర్త్ డే కి రామ్ చరణ్ అల్లూరి వీడియో ని rrr టీం విడుదల చేసింది. రామ్ చరణ్ వర్కౌట్స్ చేస్తూ.. అల్లూరి పాత్రని పవర్ ఫుల్ గా అంటే మండే అగ్ని కణంలా పరిచయం చేసింది. ఇక తాజాగా ఎన్టీఆర్ కొమరం భీం వీడియో ని దసరా కానుకగా విడుదల చేసింది. అందులోను ఎన్టీఆర్ కండలు, మేకోవర్ అద్భుతం.. ఎన్టీఆర్ ని అలా చూసాక ఎన్టీఆర్ ఫాన్స్ కి మాటల్లేవ్. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కండలు తిరిగిన బాడీలో కనిపించగానే మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేసాయ్.. ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త భయపడ్డాడు.

 కానీ ఎన్టీఆర్ వీడియో చూసాక వాళ్ళు ఫుల్ హ్యాపీ. ఇక సోషల్ మీడియాలోనూ చరణ్, ఎన్టీఆర్ rrr వీడియోస్ ఒకేలా ట్రెండ్ అయ్యాయి. ఇక రికార్డులు అటు ఇటుగా ఉంటాయి.. కానీ అటు చరణ్ ఫాన్స్, ఇటు ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ ఖుష్ గా ఉన్నారు.అయితే rrr లో ఏ హీరో తక్కువ కాదట...చరణ్ అయిన... తారక్ అయిన ఇద్దరూ సమానమే అంటున్నాడు రాజమౌళి. సినిమాలో ఇద్దరికి సమాన పాత్రలు ఇచ్చి, అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ ని బ్యాలన్స్ చేస్తూ సినిమాని తెరకెక్కిస్తున్నాడని అంటున్నాయి సినీ వర్గాలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: