ఇండియా హెరాల్డ్  అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ చాలా సందడిగా జరిగింది. సమంతతో చల్లని సాయంత్రం హౌస్ మేట్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. గీతామాధురి, శ్రావణభార్గవిల సాంగ్, అఖిల్ మెరుపు ఎంట్రీ, పాయల్ అందాలు, కార్తికేయ నృత్యాలు, హైపర్ ఆది పంచ్ లు, సమంత నవ్వులు ఇలా చాలా చక్కగా హాయిగా ఎపిసోడ్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగింది. ఇక్కడే హైపర్ ఆది వేసిన పంచ్ లకి హౌస్ నవ్వులతో నిండిపోయింది. ముఖ్యంగా హైపర్ ఆది అల్లాడించాడు. ఆడియన్స్ పల్స్ ని బాగా పట్టుకున్నాడు. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో డైరెక్ట్ గా హౌస్ మేట్స్ కి చెప్పే ప్రయత్నం చేశాడు.
మోనాల్ తో, సోహైల్ తో తనదైన స్టైల్లో పంచ్ లు వేశాడు. అంతేకాదు, అభిజిత్ తో మాట్లాడుతూ… నువ్వు అఖిల్ మోనాల్ ని చూస్తుంటే మాకు ప్రేమదేశం సినిమా చూసినట్లుగా ఉందంటూ కామెంట్ చేశాడు. ఇక డిటెక్టివ్ గా వచ్చి హౌస్ మేట్స్ మనసులో మాటల్ని బయటపెట్టాడు. అరియానా – అవినాష్ లతో కూడా ఆడుకున్నాడు. హారికని అయితే బ్రహ్మానందంతో పోల్చుతూ పంచ్ లు వేసాడు. ఇలా హైపర్ ఆది వచ్చినప్పటి నుంచీ ఎపిసోడ్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది.

అంతేకాదు, ఇప్పుడు హైపర్ ఆది బిగ్ బాస్ షో యాంకరింగ్ చేస్తే అద్దిరిపోతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలయ్యాయి కూడా. మొత్తానికి హైపర్ ఆది నువ్వు సూపర్ అంతే..!

కాగా ఈ సారి బిగ్ బాస్ ఇంటి నుంచి అనూహ్యంగా దివి ఎలిమినేట్  అయ్యింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సిందే... ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: