బాలీవుడ్ నటీమణి గా,  ఫ్యాషన్ డిజైనర్ గా పేరుగాంచిన మందిరా బేడీ దూరదర్శన్ లో ప్రసారమైన శాంతి అనే ధారావాహిక లో నటించి భారతీయ ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు అయ్యారు. ఈమె క్రికెట్ ప్రసార కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా బాధ్యతలు వ్యవహరించారు. 1999 ఫిబ్రవరి 24వ తేదీన మందిరాబేడీ రాజ్ కౌశల్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. 2011 జులై 19 వ తేదీన వీళ్ళిద్దరికీ ఒక పండంటి బాబు పుట్టాడు. అతడికి వీర్ అని నామకరణం చేశారు. అయితే ఇందిరా బేడి, రాజు కౌశల్ కలిసి ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలనుకున్నారు. 2013వ సంవత్సరం నుండి ఒక బాలికను దత్తత తీసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఏడు సంవత్సరాల తర్వాత అనగా ఇటీవల మందిరాబేడీ నాలుగేళ్ల అమ్మాయిని దత్తత తీసుకున్నారు. జులై 28వ తేదీన నాలుగేళ్ల అమ్మాయిని అనాధ ఆశ్రయం నుండి తమ ఇంటికి తీసుకొచ్చినట్టు మందిరాబేడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే ఒక ఫోటోను కూడా అప్ లోడ్ చేశారు. ఆ ఫోటోలో మందిరాబేడీ, ఆమె భర్త కౌశల్, వీర్ లతోపాటు నాలుగేళ్ల అమ్మాయి కూడా కనిపించింది. ఈ అమ్మాయికి తార బేడీ కౌశల్ గా పేరు పెట్టారు.


అయితే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నందుకుగాను మందిరా బేడీ ని అందరూ ప్రశంసిస్తున్నారు. సెలబ్రెటీలు అందరూ కూడా పేదరికంలో మగ్గిపోతున్న అనాధలను చేరదీయాలని చాలామంది చెబుతుంటారు. కానీ మందిరా బేడీ వంటి కొందరే అనాధలను దత్తత తీసుకుంటారని అభిమానులు కామెంట్ సెక్షన్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


ఇకపోతే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కి ఇంటర్వ్యూ ఇచ్చిన మందిరా బేడీ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అధారిటీ కి దరఖాస్తు చేసుకొని ఒక బిడ్డను దత్తత తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇటీవలే పర్మిషన్ లభించడంతో వాళ్లు నాలుగేళ్ల బాలికను దత్తత తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: