బిగ్ బాస్ సీజన్ 4 లో దసరా స్పెషల్ ఎపిసోడ్ గా ఆదివారం నాగార్జున బదులుగా ఆయన కోడలు సమంత వచ్చి సందడి చేసింది. మామకు తగ్గ కోడలుగా సమంత తన హోస్టింగ్ టాలెంట్ తో అలరించింది. హౌజ్ మేట్స్ తో సరదాగా షో నడిపించిన సమంత స్పెషల్ ఎట్రాక్షన్ గా కార్తికేయ, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ లతో డ్యాన్సులను వేయించారు. ఆరెక్స్ 100 జోడీ విడివిడిగా చేసిన ఈ డ్యాన్స్ షోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇదిలాఉంటే స్టేజ్ మీద సమంతని ఇబ్బంది పెట్టాడు కార్తికేయ. తన డ్యాన్స్ తో అదరగొట్టిన కార్తికేయ స్టేజ్ మీదనే సమంతని ఇబ్బంది పెట్టాడు కార్తికేయ. దివి ఎలిమినేట్ అవగా ఆమెను దగ్గర ఉండి తీసుకొచ్చాడు కార్తికేయ ఇక స్టేజ్ మీద ఉన్న సమంత దివికి నీ సినిమాలో ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరింది సమంత. అందుకు కార్ర్తికేయ తప్పకుండా అని చెప్పాడు. ఇక ఆ తర్వాత మేడం నాకు మీరు ఓ ఛాన్స్ ఇస్తారా అంటూ అడిగాడు కార్తికేయ.. కార్తికేయ అలా అడుగుతాడని ఊహించని సమంత షాక్ అయ్యింది.

మొత్తానికి సమంతతో ఓకే అనిపించేసుకున్నాడు కార్తికేయ. యువ హీరోల్లో మంచి జోష్ కనబరుస్తున్నాడు కార్తికేయ. రానున్న రోజుల్లో అతను తప్పకుండా స్టార్ క్రేజ్ తెచ్చుకోవడం పక్కా అని తెలుస్తుంది. కార్తికేయ ప్రస్తుతం చావు కబుతు చల్లగా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్య వచ్చిన సినిమా టీజర్ అలరించగా సినిమా పక్కా హిట్ అందుకునేలా ఉందని చెప్పొచ్చు.                                                     



మరింత సమాచారం తెలుసుకోండి: