అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే... నాని సర్కారు వారి పాట సినిమాలో గెస్ట్ రోల్ చేసే అవకాశాలు ఉండవచ్చు అని వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాని గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉందని ఈ సినిమాలో మహేష్ బాబుకి బావగా నానీ నటించే అవకాశం ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత కూడా ఇప్పటివరకు రాలేదు.
అయితే త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ జనాలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా హీరోయిన్ ఎంపిక విషయంలో చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. త్వరలోనే హీరోయిన్ ని ఎంపిక చేసే సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాలో విలన్ గా మహేష్ బాబుకి జగతిబాబు నటించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం భారీగా డిమాండ్ చేశాడట.