టాలీవుడ్ లో కొంతమంది హీరోల సినిమాలు అనగానే చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రధానంగా అల్లు అర్జున్ సినిమా వస్తుంది అనగానే కొంతమందికి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. సినిమా విడుదల ఎప్పుడు అవుతుంది ఏంటి అనే దానిపై చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇక సినిమాల్లో నటించే విషయంలో కూడా చాలా చర్చలు మనం చూస్తూనే ఉంటాం. ఇక సినిమాలో హీరోయిన్ ఎవరు ఏంటి అనేది దాని పై ఉండే చర్చలు అని ఎన్ని కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పుష్ప అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ గతంలో కంటే కాస్త భిన్నంగా కనిపిస్తాడు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటి అనేది తెలియక పోయినా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉండవచ్చు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇప్పుడు అసలు ఏమాత్రం కూడా స్పష్టత రావడం లేదు. ముందు ఈ సినిమాకు గాను రష్మిక మందన ను తీసుకోవాలని భావించిన ఆమె భారీగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో హీరోయిన్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్ ని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. హీరోయిన్ విషయంలో చాలా వరకు కూడా చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత రావడం లేదు. కొంతమందిని ఖరారు చేసినా సరే మళ్లీ ఆ తర్వాత వెనక్కి తగ్గుతున్నారు. రెమ్యునరేషన్ విషయంలో కీర్తి సురేష్ ఇతర హీరోయిన్ ల మాదిరిగా ఇబ్బంది పెట్టడం లేదని అందుకే ఆమె విషయంలో కొంతమంది హీరోలు కూడా కాస్త ఆసక్తి గా ఉన్నారు అని  పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: