దసరా అంటేనే తెలుగు సినిమాలకు పెట్టింది పేరు. ఆ సమయంలో వచ్చే సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంటాయి. సంక్రాంతి కల్చర్ తెలుగు పరిశ్రమలో వేళ్లూనకముందు.. దసరానే పరిశ్రమకు పెద్ద సీజన్ .ఈ సమయంలో టాప్ హీరోలు ఒకరినొకరు తలపడతారు. థియేటర్లో తమ సినిమాలను భారీ స్థాయిలో రిలీజ్ చేసి వసూళ్ల లెక్కలను ఫిలిం మ్యాగజైన్స్ లో గొప్పగా చెప్పుకుంటారు.

తెలుగు సినీ పరిశ్రమకు దసరా  ఎప్పుడూ ప్రత్యేకమే.ఈ సమయంలో ఎన్నో ప్రెస్టీజియస్ చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. సినీ అభిమానులు తమ ఫేవరెట్ హీరో  సినిమా.. ఈ టైమ్ కు రిలీజ్ చేస్తున్నాడా లేదా అని ఫిలిం మ్యాగజైన్స్ తిరిగేసేవాడు.దీనికి తోడు రెండువారాల పాటు స్కూల్లకు ఇచ్చే సెలవులు.. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు వచ్చేలా చేసేవి. ఎటు చూసిన పండగ కళ కనిపించేది. ట్రేడ్ లో  రికార్డులకు రిపోర్ట్ లు తయారుచేసుకుంటూ ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాది సినిమాలలో ఈ కల్చర్ కన్నడ పరిశ్రమకు ధీటుగా తెలుగు చిత్ర సీమలోనే ఉండేది. శోభన్ బాబు లాంటివారు ఆరోజులలోనే దసరా పండగను సినిమాలలో చూపించి వెండితెరకు పండగ కళ తీసుకువచ్చారు.

దసరా అనగానే తెలుగపరిశ్రమకు ముందుగా గుర్తొచ్చే హీరో.. బాలయ్యబాబు. దసరా సీజన్ వస్తుందంటే చాలు బాలయ్య గతంలో తన సినిమాను ఖచ్చితంగా రిలీజ్ చేసేవాడు. అప్పట్లో దీన్నొక అలవాటు  చేసుకున్నాడు.30ఏళ్ల క్రితం బిగోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన లారీ డ్రైవర్ అలా రావల్సిన సినిమానే. కాకపోతే లాస్ట్ మినిట్లో ల్యాబ్ వర్క్ లేటు కావడంతో అక్టోబర్లో రావల్సిన సినిమా డిసెంబర్ లో వచ్చింది. అయినప్పటికీ దసరా వచ్చిందయ్యా పాటతోనే సినిమాకు ప్రమోషన్ చేయించి డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేసి.. దసరా ఫెస్ట్ అంటే ఏంటో పండక అయ్యాక కూడా థియేటర్లో సెలబ్రేట్ చేశారు.

 టాలీవుడ్ హీరోలలో విక్టరీ వెంకటేష్ విజయదశమి రోజు తన సినిమాను రిలీజ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. వెంకీకి సాలిడ్ హిట్ ఇచ్చిన లక్ష్మీ సినిమాకు కలకత్తా కాళికాదేవిని.. బ్యాక్ డ్రాప్ గా చేసుకొని తీసిన యాక్షన్ పార్ట్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ అదే అమ్మవారి థీమ్ ను సందర్బం వచ్చినప్పుడల్లా వెంకీ ఉపయోగిస్తుంటాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: