థియేటర్లు నిండుగా ఉంటేనే సినిమాలు బతకగలుగుతాయి. పండగలు జనాలను థియేటర్లకు రప్పించగలుగుతాయి. కాని ఈ సారి వచ్చి పడిన కరోనా మహమ్మారితో.. దసరా పండుగకు సినిమా కళ పూర్తిగా తప్పిపోయింది. ఖచ్చితంగా వస్తాయనుకున్న సినిమాలు థియేటర్లకు రాకపోవడంతో జనాలు ఎంటర్ టైన్ మెంట్ ఆప్షన్స్ వెతకడం మొదలుపెట్టేశారు.

దసరా రాగానే రెండువారాల పాటు వచ్చే సెలవులలో..ఓ ఫ్యామిలీ ఏదో ఒక సినిమాకు ఒక రోజు కేటాయిస్తుంది. ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోను ముందునుంచి ఈ కల్చర్ ఉంది. దీంతో  పండగ వాతావరణం వచ్చిన వెంటనే పెద్ద పెద్ద సినిమాలకే థియేటర్లు కేటాయించే పరిస్థితి నెలకొనిఉంది. కానీ ఈ సారి ఆ పరిస్థితులు లేవు. అసలు దసరాకు సినిమా రిలీజ్ అనేదే లేకుండా పోయింది. దీంతో గతంలో దసరాకు వచ్చిన సినిమాల గురించి డిస్కస్ చేసుకోవల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది దసరాకు చిరంజీవి సినిమా సైరా రిలీజ్ అయింది. 200కోట్లకు పై బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గ్రాండియర్ లుక్ తో సినిమా ఓకే అనిపించుకుంది.

గత ఏడాది దసరా కానుకగా వచ్చిన సైరా సినిమాకు కలెక్షన్లు తెచ్చిపెట్టడంలో పండగ వాతావారణం బాగా ఉపయోగపడింది. అత్యధిక థియేటర్లలో సినిమా రిలీజ్ కావడంతో సినిమా సగం వరకు సక్సెస్ అయింది. ఇక ఆ తర్వాత వచ్చిన టాక్.. సినిమాను  డ్యామేజ్ చేసినా అప్పటికే ఆల్మోస్ట్ గట్టెక్కేసిన పరిస్థితి. ఇదంతా దసరా పండగ తీసుకువచ్చిన కిక్ అంటారు ఫిల్మీ క్రిటిక్స్ .

దసరాకు సినిమాలు రిలీజ్ చేయడంలో నందమూరి హీరోల వారసత్వాన్ని నేటి తరం హీరో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసుకున్నాడు. 2018లో అరవింద సమేతతో తారక్ అదరగొట్టాడు. అప్పటివరకు తాను టచ్ చేయని టెక్నికల్ యాక్షన్ జోనర్ ను ఈ సినిమాలో ట్రై చేశాడు. అంతే 160కోట్ల గ్రాస్ వచ్చిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: