థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టాలంటే కొత్త బొమ్మ పడాలి. ప్రేక్షకులు వస్తేనే నిర్మాతలు కొత్త పిక్చర్ రిలీజ్  చేస్తామంటారు. ఇదంతా ఎందుకని ఎక్జిబిటర్లే రిస్క్ చేసి రీసెంట్ హిట్ ఫిలింస్ ను రిలీజ్ చేస్తే.. పదుల సంఖ్యలో మాత్రమే ఆడియన్స్ వస్తున్నారు.

ఆఫ్టర్ లాక్ డౌన్ థియేటర్ సిస్టమ్ మెరుగు పడుతుందని, ఇచ్చిన మార్గదర్శకాలను మరింత సరళతరం చేస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికీ కరోనా భయం జనాలలో పోవడం లేదు. దీనికి తోడు ప్రభుత్వాల పేరుతో  కరోనా సెకండ్ వేవ్ అంటూ  మెసేజ్ ల రూపంలో వస్తున్న హెచ్చరికలు ప్రేక్షకులను మరింతగా భయపెడుతున్నాయి. రానున్న మూడునెలలు ఎంతో కీలకమంటూ వస్తున్న డేంజర్ బెల్స్ కు దసరానే కాదు దీపావళి, క్రిస్ట్ మస్ కు కూడా సినిమాలు వచ్చేలా కనిపించడం లేదు.

ప్రస్తుతానికి  భీష్మ లాంటి పాత సినిమాలను వేస్తూ థియేటర్లను కొందరు రన్ చేస్తున్నారు..జనాలు కూడా పదుల సంఖ్యలోనే వస్తున్నారు. గత వారం ఆర్టీసి క్రాస్ రోడ్ లో ప్రముఖ థియేటర్లో సినిమా వేస్తే జస్ట్ 1500 రూపాయలు వచ్చాయని తెలిసి పలువురు ఆశ్చర్యపోయారు. అంటే కనీసం 15సీట్ల డబ్బు కూడా రాలేని పరిస్థితి థియేటర్ వ్యవస్థకు వచ్చిదంటే ఏమని అర్ధం చేసుకోవాలి చెప్పండి.

ఈ దసరాకు  ఒక్కటంటే ఒక్క సినిమా కూడా థియేటర్ లోకి రాలేదు.. ఒకవేళ వస్తే దీపావళికి అంటున్నారు. అప్పటి కూడా సినిమా వస్తుందనే గ్యారంటీ లేదు.ఎందుకంటే దానికి  ఇంకో మూడువారాలు మాత్రమే టైమ్ ఉంది.అయినా దీపావళికి సినిమాలు రిలీజ్ చేసే కల్చర్ కోలీవుడ్ కు మాత్రమే ఉంది. ఆ రైట్స్ పూర్తిగా వారికే ఉన్నాయి. ఒకవేళ  దీపావళికి తెలుగు సినిమాలు థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. ఇప్పుడున్న 5శాతం ఆక్యుపెన్సీ ఆ టైమ్ కు కశ్చితంగా 50శాతం ఆక్యుపెన్సీగా మారాలి. లేదంటే సినిమాను థియేటర్లో రిలీజ్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: