సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య జరిగి ఇప్పటికే నాలుగు నెలలు ముగిసింది...మొదటి ఆత్మ హత్య కేసు.... నటి రియా చక్రవర్తి చుట్టూ అల్లుకోగా... ఆ తర్వాత మరో కొత్త మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో పలు అంశాలపై చర్చ మొదలైంది.... ప్రముఖంగా డ్రగ్స్ విషయం హైలైట్ అయింది. బాలీవుడ్లో మొదలైన డ్రగ్స్ కలకలం... కొందరిని మామూలుగా కలవర పెట్టలేదు. వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు బాలీవుడ్ ప్రేమికులకు నిద్ర లేకుండా చేసింది. ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసింది... డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్ననార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ కేసులో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేసి విచారిస్తూ ఉంది.

ఈ క్రమంలో ప్రముఖ బుల్లి తెర నటి ప్రీతికా చౌహాన్ ఈ కేసులో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారిపోయింది. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది ఈ భామ. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ నాట కలకలం రేపింది. నటిగా ప్రీతికా చౌహన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'సంవాదన్ ఇండియా', 'దేవో కె దేవ్ మహదేవ్' వంటి సీరియళ్లలో నటించిన ప్రీతికా అందరి అభిమానాన్ని అందుకుంది. ప్రీతికా డ్రగ్స్ కొనుగోలు చేస్తూ డైరెక్ట్ గా దొరికి పోవడంతో.... ఈమెను  ఇప్పటికే అరెస్టు చేయగా, కోర్టులో  ప్రవేశపెట్టనున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

వెర్సోవాలోని మచ్చిమార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో ‘ఫైజల్’ అనే 20 ఏళ్ల యువకుడి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా ప్రీతికాను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 99 గ్రాముల గంజాయితోపాటు మారిజునా మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రీతికా చౌహన్ అరెస్ట్ తో మరికొందరు బుల్లితెర నటల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చర్చ కొనసాగుతోంది... మరి ఇప్పుడు ఈ వ్యవహారం మరెంత దూరం వెళుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: