సమంత హైలీ టాలెంటెడ్ అని అందరూ ఒప్పుకుంటారు. ఆమె ఎంత మాయ చేయకపోతే టాలీవుడ్ అలా నీరాజనాలు అర్పిస్తుంది మరి. ఇక అక్కినేని అందగాడు ఆమెకు జతగాడుగా మారాడంటేనే సమంత ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అక్కినేని వారి కోడలు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పెద్ద కిక్కే ఇచ్చారని అంటున్నారు. రేటింగ్స్ అదిరిపోయాయి. దసరా రోజు ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ తో షో కేక పెట్టిందని అంటున్నారు. దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఫుల్ హ్యాపీస్ ట‌. ఫస్ట్ టైం హోస్ట్ చేసినా కూడా ఎక్కడా తడబడకుండా సమంత చేసిన తీరు అందరికీ షాక్ అనిపించిందట.

ఇదిలా ఉంటే వీకెండ్ కి మామూలుగానే బిగ్ బాస్ షో రేటింగ్స్ ఒక లెక్కలో ఉంటాయి. నాగార్జున హోస్టింగ్ తో అలా జరిగే మ్యాజిక్ అది. దాన్ని మరింత పెంచేలా సమంత షో సాగిందని అని చెబుతున్నారు. సమంత హోస్టింగ్ కి తోడు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్  డ్యాన్స్, జబర్దస్త్ ఆది కామెడీ, యువ నటుడు  కార్తికేయ ఎంట్రీ ఇవన్నీ కలసి దసరా నాడు వచ్చిన షో రేటింగ్ అదుర్స్ అంటున్నారు.

ఇదిలా ఉంటే మరో రెండు వారాల పాటు సమంత హోస్ట్ చేస్తుంది అంటున్నారు. ఈ మొత్త్తం మూడు ఎపిసోడ్స్ కి గానూ ఆమెకు గట్టిగానే రెమ్యునరేషన్ ముడుతోందని అంటున్నారు. ఆమెకు రెండు కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్ అయితే ప్రచారంలో ఉంది. అదే నిజం అయితే మామగారు  నాగార్జునను అక్కడ కూడా సమంత డ్యామినేట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం సీజన్ కే నాగార్జునకు ఎనిమిది కోట్లు ఇస్తున్నారుట.  మరి మధ్యలో వచ్చి కేవలం మూడే మూడు ఎపిసోడ్స్ చేసిన సమంతా రెండు కోట్లు తీసుకుంటోంది అంటే నిజంగా అక్కినేని వారి కోడలు గ్రేటే కదా.



మరింత సమాచారం తెలుసుకోండి: