బిగ్ బాస్ షోలో వారం వారం తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తుంది అరియానా గ్లోరీ. తనదైన ఆటతీరుతో అమ్మడు సత్తా చాటుతుంది. అయితే హౌజ్ లో అవినాష్, అరియానాల జోడీ కుదిరింది. షో కోసమో లేక ఇలా చేస్తేనే ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయొచ్చనో కారణం ఏదైనా అవినాష్, అరియానా ఇద్దరు ఫ్రెండ్స్ గా హౌజ్ లో ఆట ఆడుతున్నారు.

అయితే నిన్న జరిగిన స్వయంవరం టాస్క్ లో భాగంగా అరియానా, మెహబూబ్ ఇద్దరు విన్నర్ గా నిలిచారు. అయితే అరియానా హౌజ్ లో ఎవరితోనైనా ప్రేమలో పడ్డావా.. ఎవరితో అయినా కనెక్ట్ అయ్యావా అని అనగా.. ఆల్రెడీ తను ఎంగేజ్డ్ అని చెప్పింది. బయట తను ఎవరికో ఆల్రెడీ ఎంగేజ్ అన్నట్టు హింట్ ఇచ్చింది అమ్మడు. సో అవినాష్ ఆశలను అడి ఆశలు చేస్తూ అరియానా పెద్ద బాంబ్ పేల్చిందని చెప్పొచ్చు.

అరియానా ఆల్రెడీ ప్రేమలో ఉందని తెలియక అవినాష్ ఆమె మీద ప్రేమని చూపిస్తున్నాడు. మొత్తానికి హౌజ్ లో వాళ్లతో కాకుండా బయట తనకు ఆల్రెడీ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి మరోసారి అరియానా తన బోల్డ్ నెస్ ఏంటో అందరికి తెలిసేలా చేసింది. మరి అరియానా మనసు గెలిచిన ఆ లక్కీ పర్సన్ ఎవరో చూడాలి. ప్రతి వారం లానే ఈ వారం కూడా అరియానా నామినేషన్స్ లో ఉందని తెలుస్తుంది. తప్పకుండా ఆమె హౌజ్ లో ఉన్న అందరికి టఫ్ ఫైట్ ఇస్తుందని అనిపిస్తుంది.                                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: