టాలీవుడ్ లో కొంతమంది గురించి ఎక్కువగా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా పవన్ కళ్యాణ్ కుమారుడు గురించి ఎక్కువగా వార్తలు వస్తూనే ఉంటది. ఏదో ఒక సందర్భంలో అతని గురించి మీడియాలో వార్తలు వస్తూనే  ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే అతని గురించి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అతను కాస్త హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తల్లి రేణుదేశాయ్ అతనిని సినిమాల్లోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

అయితే అందుకు అనుగుణంగా పరిస్థితి కనబడటం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తలను ఆధారంగా చూస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుమారుడు రామ్ చరణ్ సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఏ సినిమాలో నటిస్తాడో ఏంటి అనేది తెలియదు గానీ రామ్ చరణ్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చే సినిమాలో అతను కనపడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

దీనికి సంబంధించి త్వరలోనే ఒక అధికారిక పర్యటన కూడా రానుంది. అంతేకాకుండా నాని సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కొడుకు కనపడే అవకాశం ఉందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. చిరంజీవి ఆచార్య సినిమా లో అతనికి ఒక గెస్ట్ రోల్ ఇవ్వాలి అని భావించిన సరే అది సాధ్యం కాలేదు. దీనితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన కొడుకు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు కొడుకు విషయంలో పవన్ కళ్యాణ్ మాత్రం కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. అయితే ఒక సినిమాలో హీరోగానే కొడుకు ని పరిచయం చేయాలని పవన్ కళ్యాణ్ భావించిన సరే అందుకు అనుగుణంగా పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: