తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి . వాటికి కొనసాగింపు సినిమాలు (పార్ట్-2) వచ్చాయి. మరి  అలాటి సినిమాల గురించే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం . మొదటి సినిమా విజయం కావడం తో కొందరు దర్శకులు వాటికి కొనగింపు సినిమాలు కూడా చేశారు. కథ మొదటి భాగానికి కొనసాగింపు కావచ్చు లేదా వేరే కొత్త కథ కావచ్చు . ఏ విధంగా  ప్రయత్నించిన  తెలుగు లో కొనసాగింపు సినిమాలు పెద్దగా కలిసి రాలేవని చెప్పాలి . మొదటి భాగంతో  విజయం పొంది రెండో భాగం తో బోల్తా పడ్డాయి.వాళ్ళు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలు  బాక్సాఫీసే దగ్గర అపజయాన్ని మూటగట్టుకున్నాయి.  ఇంతకీ ఆ సినిమాలెంటో చూద్దాం. కొనసాగింపు సినిమాలు ఆడకపోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు . కానీ హింది ,తమిళ్ మరియు ఇతర భాషల్లో విజయాలు పొందినపుడు ఒక్క తెలుగులోనే ఎందుకని సక్సెస్ కావడం లేదు . నేనైతే  కథే కొనసాగింపు చిత్రం  ఆడకపోవడానికి  ముఖ్య కారణం అని చెప్పగలను ..
   
మొదటగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన శంకర్ దాదా MBBBS. ఇది ఒక హింది రీమేక్ సినిమా .  ఈ సినిమా చిరంజీవి గారు నటించిన గొప్ప సినిమాలలో  ఒకటిగా నిలుస్తుంది . ఇక ఆ సినిమాకి కొనసాగింపుగా  శంకర్ దాదా జిందాబాద్ వచ్చింది. శంకర్ దాదా జిందాబాద్ ముందు వచ్చిన సినిమా అంతగా ఆడలేదు . కారణాలు చూసుకుంటే ఒకటి హీరోయిన్ మరియు విలన్ ఇద్దరు ఈ సినిమాకి సెట్ కాలేదని నాకు అనిపించింది .

మరో హీరో  కింగ్ నాగార్జున గారి విషయానికి వస్తే  అప్పట్లో మన్మధుడు అనే ఒక సినిమా వచ్చింది . ఈ సినిమా మంచి విజయాన్ని సాదించింది. ఈ సినిమాని కన్నడ లో  ఐశ్వర్యా అనే పేరుతో  రీమేక్ చేశారు . అయితే మన్మధుడు కి కొనసాగింపుగా 2019 లో మన్మధుడు-2  వచ్చింది . ఈ సినిమాని హీరో కం డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించారు . మరి మన్మధుడు -2 సినిమా అంచనాల మద్య విడుదలై విజయం సాదించలేకపోయింది .

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ పవన్ అభిమానులందరిని తల పైకి ఎత్తుకునేలా చేసింది ఇక ఈ సినిమాలోని సంబాషణలు కూడా విజిల్స్ వేసేలా వుంటాయి . మీకు తెలుసు గబ్బర్ సింగ్ అనేది హింది దబాంగ్ రీమేక్ అని . రీమేక్ అయిన తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టుగా దర్శకుడు హరీష్ శంకర్ చాలా మార్పులు చేశారు . గబ్బర్ సింగ్ సినిమా తో కమేడియన్ అయిన బండ్ల గణేశ్ ని ప్రొడ్యూసర్ ని చేసింది .. ఆ సినిమా ఇచ్చిన విజయం తో  కొనసాగింపుగా  సర్దార్ గబ్బర్ సింగ్  అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్నంత ఆడలేదు డిజాస్టర్ అయింది . చివరికి పవన్ అభిమానులకు నిరాశే మిగిలింది .

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా ఆర్య . చిన్న సినిమాగా విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది . ఆ సినిమాకి కొనగింపుగా ఆర్య -2 వచ్చింది . ఆర్య -2 అనుకుకున్నంతగా విజయం సాదించలేదు . నాకు తెలిసి ఆర్య -2 మంచి సినిమానే ఎక్కడో ఏదో పొరపాటు జరిగి వుంటుంది . ఆర్య -2 పాటలు బాగుంటాయి , డాన్స్ లు బాగుంటాయి . ఇన్ని వున్న కూడా ఎందుకు ఫ్లాప్ అయిందో అర్థం కావడం లేదు .

తర్వాత సినిమా మన మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం కిక్ సురేందర్ రెడ్డి  దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా  మోస్తరు విజయం సాదించింది ఈ సినిమాతోనే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు .ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో కొనసాగింపుగా కిక్-2 తీశారు . కిక్-2 పెద్ద డిజాస్టర్ అయ్యింది . కిక్-2 విజయం సాదించకపోవడానికి అసలు కారణం మూవీలోని సెకండ్ ఆఫ్ .

పైన వున్నవే కాకుండా థ్రిల్లర్ జోనర్ లో ఓంకార్ గారు తీసిన రాజుగారి గది మూడు భాగాలు (1,2,3) నాకైతే రాజుగారి గది మొదటిభాగం నచ్చింది . మరియు ఛార్మి మంత్ర , మంత్ర-2 సినిమాలు మహా మహా అంటూ స్టెప్స్ వేసే ఛార్మి పాట గుర్తుండే వుంటుంది. ఈ  సినిమాలని నేను చూడలేదు మీరు చెప్పండి ఎలా వున్నాయో . అంతేకాదు ఆ ఫిల్మ్ బై అరవింద్, అరవింద్-2 , ఆపరేషన్ దుర్యోదన ,ఆపరేషన్ దుశ్శాసన,అవును ,అవును 2 , రణం ,రణం 2   సినిమాలు కూడా వచ్చాయి . దాదాపుగా అంచనా వేస్తే  ఈ సినిమాలన్నింటిలో మొదటి భాగం సినిమాలే విజయాలు సాదించాయి .

కొనసాగింపు సినిమాలంటే మనకి గుర్తొచ్చే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . ఈ సబ్జెక్టు లో ఇతన్ని మర్చిపోతే ఎలా ! ఎలాంటి సినిమా అయిన కథ అనేది లేకున్నా కేవలం కెమెరా యాంగిల్స్ తో మరియు సౌండ్ ఎఫ్ఫెక్ట్స్ తో రెండు మూడు భాగాల  సినిమాలు తీసేయగలదు మన ఆర్‌జి‌వి .ఇతడు తీసిన సత్య, సత్య-2 , ice క్రీమ్, ice క్రీమ్-2 , రక్త చరిత్ర (1,2) సినిమాలని మనం చూశాం కదా . ఆర్‌జి‌వి కి సినిమా హిట్ , ఫ్లాప్ తో సంబంధం లేదు . ఎందుకంటే అతడు సినిమా ప్రేమికుడు .

ఇన్ని కొనసాగింపు సినిమాలలో మొదటి భాగం విజయం సాదిస్తే రెండో భాగం విజయం సాదించడం లేదు .. కానీ మొట్టమొదటి సారిగా ఈ రెండు భాగాల సినిమాలు అద్భుత విజయాలు సాదించాయి. ఆ సినిమాలే ఎస్.ఎస్. రాజమౌళి తీసిన బాహుబలి ది బెగినింగ్ మరియు బాహుబలి ది కంక్లూజన్ . నాకు తెలిసి కొనసాగింపు  సినిమాల లిస్ట్ తీస్తే ఇవే మొదటి రెండు స్థానాలలో నిలుస్తాయి .. తెలుగు లో దర్శకులు కొనసాగింపు చిత్రాలు చేయడంలో కథలో మరియు నటీనటుల ఎంపికలో  తప్పులు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను . 

మరింత సమాచారం తెలుసుకోండి: