బిగ్ బాస్ హౌజ్ లో ఎనిమిదవ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరుగనుంది. మండే వచ్చింది అంటే నామినేషన్స్ రచ్చ మొదలవ్వాల్సిందే. ఈసారి హౌజ్ లో నామినేషన్స్ ప్రక్రియను సుత్తితో ఫోటోలను పగలకొట్టడం. ఈ టాస్క్ లో భాగంగా ఈ వారం ఆరుగు హౌజ్ మేట్స్ నామినేట్ అయినట్టుగా తెలుస్తుంది. కెప్టెన్ అయిన సందర్భంగా అవినాష్ సేవ్ అవగా హౌజ్ లో ఉన్న 11 మందిలో ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

ప్రతివారం అఖిల్, అభిజిత్ లకు జరిగే గొడవ కాస్త ఈసారి అమ్మా రాజశేఖర్, అఖిల్ ల మధ్య జరిగింది. మోనాల్ కు సపోర్ట్ చేస్తూ అఖిల్ మాట్లాడుతున్న క్రమంలో అమ్మా రాజశేఖర్ రివర్స్ లో అతని మీద ఎటాక్ చేశాడు. ఫైనల్ గా ఈ వారం ఆరుగురు హౌజ్ మేట్స్ నామినేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ వారం నామినేట్ అయిన హౌజ్ మేట్స్ గురించి చూస్తే అఖిల్, మోనాల్, అరియానా, అమ్మా రాజశేఖర్, మెహబూబ్, లాస్యలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

నాలుగు వారాలుగా నామినేషన్స్ లో ఉన్న అభిజిత్ ఈ వారం నామినేషన్స్ లో లేడని తెలుస్తుంది. అతనితో పాటుగా హారిక, నోయెల్ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక కెప్టెన్ అయినందుకు అవినాష్ నామినేషన్స్ నుండి బయటపడ్డాడు. మొత్తానికి ఈ వారం కూడా నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఇక అభిజిత్ కూడా మరోసారి మోనాల్ మీద ఫైర్ అయ్యాడు. ప్రోమోలో అభిజిత్ మోనాల్ ను ఉద్దేశించి మాటాడటం హైలెట్ గా నిలిచింది.    

                                               

మరింత సమాచారం తెలుసుకోండి: