ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షో  నాలుగవ సీజన్ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రతి వారం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది బిగ్ బాస్ షో. అయితే ఈ షో కి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే.. లీక్స్. అవునూ.. ప్రతి వారం ఏదో ఒక విషయం లీక్ అవుతూనే ఉంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారి లిస్టు కూడా లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ లిస్టు ఏంటి? ఎవరెవరు ఉన్నారు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. బిగ్ బాస్ నిర్వహకులు షోకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. కానీ, ఎలిమినేషన్ విషయంలో వాళ్లకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. మొదటి సీజన్ నుంచి ప్రస్తుత సీజన్ వరకు ప్రతిసారీ ఇంటి నుంచి బయటకు వెళ్లేది ఎవరో ముందే లీక్ అవుతోంది. ఫలితంగా ఆ ముఖ్యమైన ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయింది వీళ్ళే అంటూ ఓ లిస్టు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
అయితే ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే.. అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం జరగనున్న నామినేషన్ ప్రక్రియలో మోనాల్ గజ్జర్, మెహబూబ్, అఖిల్ సార్థక్, లాస్య, అమ్మ రాజశేఖర్, ఆరియానా గ్లోరీ ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లారు. అయితే, ఇప్పటి వరకూ వరుసగా నామినేట్ అవుతూ వస్తోన్న లవర్ బాయ్ అభిజీత్ మాత్రం ఈ వారం నామినేషన్ నుంచి తప్పించుకున్నాడని తెలిసింది. చూడాలి మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో.. పోయిన వారం దివి ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ వారం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: