వంటలక్క...ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఉండరేమో. అంతలా ఫేమస్ అయ్యారు ప్రేమి విశ్వనాథ్. మాలీవుడ్ కి చెందిన నటి అయినప్పటికీ, కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. తమ ఇంట్లో అమ్మాయిగా ఫీలవుతుంటారు. చిన్నా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఈమెను ఆరాధిస్తారు. సీరియల్ లో ఒకరోజు ఈమె కనబడకపోతే కంగారుపడేంతగా వీరాభిమానులున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఆమె క్రేజ్ ఏంటో అనేది. యూత్ సైతం ఈమె కోసం పరితపిస్తుంటారు.


మొన్నా మధ్య వరదలు వచ్చి ఇంట్లోకి మోకాళ్ళ లోతు నీరు వస్తే, కుటుంబమంతా కలిసి ఈ టి‌విలో కార్తీకదీపం సీరియల్ చూస్తున్న ఫోటో ఒకటి వైరల్ అయ్యింది. ఈ ఒక్క రీజన్ చాలు జనాల్లో ఆమెకు ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే, వంటలక్కను సినీ దర్శకులు కోరి మరీ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. అవును, వంటలక్క త్వరలోనే వెండితెర మీద దర్శనమివ్వనున్నారు. ఈ విషయాన్ని వంటలక్కే స్వయంగా వెల్లడించారు.



లేడీ ఓరియెంటెడ్ మూవీలో పోలీస్ ఆఫీసర్ కేరెక్టర్ చేస్తున్నట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అసలు ఈ పాటికే సినిమా పూర్తయ్యి రిలీజ్ కావాల్సి ఉందని, కానీ కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు ఆగిపోవడంతో ఆలస్యం అయ్యిందని అన్నారు. మళ్ళీ ఇప్పుడు షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో షూటింగ్ లో పాల్గొంటున్నట్లు ఆమె వెల్లడించారు. దీంతో వంటలక్కను ఎప్పుడెప్పుడు సినిమాల్లో చూస్తామా అని అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరి బుల్లితెర మీద సత్తా చాటిన ప్రేమి విశ్వనాథ్ వెండితెర మీద కూడా ఆ రేంజ్ లో సత్తా చాటుతారా? సత్తా చాటాలనే కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: