ఓ సినిమాలో నటించే హీరో హీరోయిన్లు.. దర్శకుడు, టెక్నీషియన్లతో సినిమాలో భారీతనం పెరిగిపోతుంది. ఆ సినిమాకు దేశంలో టాప్ టెక్నీషియన్లు గానీ.. హాలీవుడ్ టెక్నీషియన్స్ గానీ పని చేస్తే సినిమా రేంజ్ మరింత పెరిగిపోవటం ఖాయం. ప్రస్తుతం బాలీవుడ్ టెక్నీషియన్ తో ఓ టాలీవుడ్ ఫిలింకు క్రేజ్ వస్తోంది. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా ‘వైల్డ్ డాగ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫుల్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ బాలీవుడ్ స్టంట్ డైరక్టర్ పని చేస్తున్నాడు.

బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ ప్రముఖ యాక్షన్ డైరక్టర్. బాలీవుడ్ లో క్రిష్, గ్యాంగ్స్ వస్సేపూర్, కమీనే, థూమ్3, బాజీరావ్ మస్తానీ, దంగల్, పద్మావత్, సంజు.. వంటి భారీ హిట్ సినిమాలకు ఫైట్ మాస్టర్ గా పని చేశారు. ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ కు పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చారు. ‘మనాలిలో రోహ్ తంగ్ పాస్ దగ్గర షూటింగ్. మైనస్ జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్. అప్పుడే ఇక్కడ మంచు ప్రారంభమైంది. అయినా షూటింగ్ సాఫీగా జరుగుతోంది’ అంటూ తన అనుభవాలను వెల్లడించారు.

ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. 30 ఏళ్లుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఫైట్లు కంపోజ్ చేశారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిసినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దియా మీర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ తోనే సినిమా పూర్తవబోతోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: