అవునూ.. అన్న మెగాస్టార్ మూవీ టైటిల్ తో తమ్ముడు పవన్ స్టార్ మూవీ చేయనున్నట్టు సమాచారం. అయితే ఇంతకీ ఆ టైటిల్ ఏంటి? అయితే ఆ టైటిల్ ఏ సినిమా కోసం? డైరెక్టర్ ఎవరు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. మొన్నటికి మొన్న సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నట్టు సూర్యదేవర నాగవంశీ  ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది మలయాళ బ్లాక్ బస్టర్ "అయ్యప్పనమ్ కోషియం" అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇపుడు ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేశారని.. అది ఇదేనంటూ ఓ టైటిల్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. అయితే అది మెగాస్టార్ చిరంజీవి మూవీ టైటిల్ కావడం విశేషం. ఇంతకీ ఆ టైటిల్ ఏంటంటే.. "బిల్లా రంగా". చిరంజీవి, మోహన్‌బాబు నటించిన 1982 హిట్ చిత్రానికి ఇది టైటిల్. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఇపుడు పవన్ కళ్యాణ్ చేయనున్న ఈ మలయాళ బ్లాక్ బస్టర్ కి ఇదే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది.  ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు. అతను ఇప్పటికే పవన్ కళ్యాణ్ యొక్క వకీల్ సాబ్ కోసం సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది అంతస్తుల్లోకి వెళ్తుంది అలాగే ఏడాది రెండవ భాగంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. మొదట్లో ఈ సినిమా మాస్ మహరాజా రవితేజ మరియు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తో తీయాలని ప్రయత్నాలు జరిగాయి.. కానీ నిజమవ్వలేదు. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ తో సంప్రదింపులు జరిపారు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎట్టకేలకు యువ దర్శకుడు సాగర్ చంద్ర తెలుగు నేటివిటీకి అనుగుణంగా చేసిన మార్పులతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మెప్పించి ఒప్పించినట్లు సమాచారం. ఇంతకీ ఈ సాగర్ చంద్ర ఎవరంటారా.. "అయ్యారే", "అప్పట్లో ఒకడుండేవాడు" వంటి సెన్సిబుల్ మూవీస్ తీసిన దర్శకుడు ఇతనే.

మరింత సమాచారం తెలుసుకోండి: