సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే ఫ్యాన్స్ కు స్పెషల్ పండుగ అన్నట్టే. కంటెంట్ ఉన్న సినిమాలకే మహేష్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు.. తన లుక్ విషయంలో పెద్దగా పట్టించుకోడు అందుకే మహేష్ తన లుక్ విషయంలో అక్కడక్కడ కొన్ని విమర్శలు అందుకుంటాడు. క్యారక్టరైజేషన్ డిఫరెన్స్ కనిపించినా లుక్ మాత్రం ఒకేలా ఉంటాయని ఫ్యాన్స్ కూడా కొద్దిగా నిరాశలో ఉన్నారు.

అప్పుడెప్పుడే పోకిరి సినిమాలో మహేష్ మాస్ లుక్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించేసింది. ఆ తర్వాత అతిధి సినిమాలో కూడా మహేష్ కొత్త లుక్ ట్రై చేశాడు. అయితే మహేష్ ఇన్నాళ్లకు మళ్లీ తన కొత్త లుక్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ కంప్లీట్ గా కొత్త లుక్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ మళ్లీ పోకిరి లాంటి లుక్ కోసం ట్రై చేస్తున్నట్టు టాక్.

ఈమధ్య సోషల్ మీడియాలో మహేష్ లుక్స్ వైరల్ గా మారాయి. సినిమాలో మహేష్ రోల్ రఫ్ గా ఉంటుందట అందుకే ఆ పాత్రకు తగినట్టుగా లుక్ ట్రై చేస్తున్నాడట. సర్కారు వారి పాట మహేష్ ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. సకారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నారు.                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: