హీరోకు ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తర్వాత వెంటనే వచ్చే సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఆ అంచనాలను సినిమా ఖచ్చితంగా అందుకోవాల్సిందే. కారణం.. అభిమానులు, ప్రేక్షకులు, బిజినెస్ సర్కిల్స్ లో అంచనాలు, ఆశలు పెరిగిపోతాయి. ప్రస్తుతం ఇటువంటి స్టేజ్ లోనే ఉన్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. గత ఏడాది ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఈ హీరో ఇప్పుడు ‘రెడ్’ సినిమాతో రాబోతున్నాడు. గతంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న రెడ్.. కోవిడ్ కారణంగా రిలీజ్ ఆగిపోయింది.

వచ్చే సంక్రాంతికి రెడ్ ను రిలీజ్ చేస్తామని ఇటివలే ప్రకటించారు నిర్మాత స్రవంతి రవికిశోర్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ‘తాడం’ సినిమాకు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పూర్తి రఫ్ లుక్ లో ఉన్న రామ్ గెటప్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ను పూరి చూపించిన విధానం రామ్ లోని కొత్త కోణాన్ని, రఫ్ యాంగిల్ ను పరిచయం చేసింది. ఆ క్రేజ్ కు తగ్గట్టుగానే మళ్లీ రఫ్ అండ్ టఫ్ పాత్రలో రానున్నాడు రామ్.

సినిమా విజయం రామ్ కు చాలా ముఖ్యం. సినిమా హిట్ అయితే రామ్ ఇమేజ్ మరింతగా పెరగడం ఖాయం. నేను.. శైలజ తర్వాత దర్శకుడు కిశోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో రామ్ నటిస్తున్న రెండో సినిమా ఇది. ఓటీటీల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా ధియేటర్ రిలీజ్ కే మొగ్గు చూపారు మేకర్స్. శాటిలైట్ రైట్స్ ను కూడా 13 కోట్లకు పైగానే వెచ్చించి జెమినీ టీవీ తీసుకుందని అంటున్నారు. మాళవిక శర్మ, నివేధా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: