కరోనా వల్ల థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి.. ఇంకా పలుచోట్ల మూసే ఉన్నా మెయిన్ మెయిన్ సిటీ ల్లో రోజు థియేటర్లు నడుస్తున్నాయి.. అయితే నిర్మాతలు మాత్రం ఇప్పుడే తమ సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేయడానికి సాహసం చెయ్యట్లేదు.. ప్రేక్షకులు ఇప్పుడే థియేటర్లకు రావడానికి ఇష్టం చూపకపోవడంతో నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారని చెప్పొచ్చు.. అయితే నిన్న దసరా సందర్భంగా చాల సినిమా ల ఫస్ట్ లుక్ లు రిలీజ్ అయ్యాయి.. అందులో అన్ని సినిమా లు సంక్రాంతి కే వస్తున్నామంటూ అనౌన్స్ చేశాయి..

రవితేజ ‘క్రాక్’ సినిమా ని సంక్రాంతి కి రిలీజ్ చేద్దామనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది.. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి..ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ రెడ్ సినిమా లో చేస్తున్నాడు.. ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాడు.. రానా ప్యాన్ ఇండియా మూవీ  ‘అరణ్య’ కూడా సంక్రాతి కే రాబోతుందని తెలుస్తుంది..ఇప్పటికే పలుమార్లు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ఈ సినిమా సంక్రాంతి రావడం ఖాయం అనిపిస్తుంది. నితిన్ ‘రంగ్ దె’, వంటి సినిమాలే కాకుండా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ , కెజిఎఫ్ 2 వంటి భారీ సినిమాలు కూడా సంక్రాంతి కి రిలీజ్ అవుతున్నాయి.. కెజిఎఫ్ నుంచి ఇప్పటికే వార్తలు వస్తుండగా వకీల్ సాబ్ సంక్రాంతి కి వస్తుందా అనేది చూడాలి..

ఒకే సీజన్లో ఇన్ని సినిమాలంటే ఇక హౌస్ ఫుల్ బోర్డు పెట్టేయాల్సిందే. వేరే సినిమాలకు అవకాశం లేనట్లే. వీటిని సంక్రాంతికి సిద్ధం చేయడం కష్టమేమీ కాదు కానీ.. అప్పటికి థియేటర్లు తెరుచుకుని మామూలుగా నడుస్తాయా లేదా అన్నదే సందేహంగా ఉంది.  సంక్రాంతి కంటే ముందే థియేటర్లు 100 పర్సంట్ ఆక్యుపెన్సీతో నడిచి జనాలు ఒకప్పట్లా సినిమాలు చూడ్డానికి వస్తేనే ఈ సినిమాలన్నీ సంక్రాంతి రేసులో ఉంటాయన్నది స్పష్టం.


మరింత సమాచారం తెలుసుకోండి: