నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కి మహానటి తెలుగులో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు గాను జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌ వలన సినిమా  షూటింగ్స్ సహా థియేటర్స్ బంద్ అయ్యాయి. ఇక థియేటర్స్ ఓపెన్ చేసుకునే అవకాశం ఇచ్చినా జనాలు మునుపటిలా వచ్చి సినిమాలు చూడడం అనేదే సాధ్యమయ్యే పని కాదు. అందుకే సినిమాలు అన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే తెలుగులో నాలుగైదు సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్అనే మల్టీ లింగ్యుయల్ మూవీ కూడా అలానే ఆమెజాన్ ద్వారా విడుదలయింది. అయితే  కీర్తి నటించిన మరో సినిమా కూడా అదే బాట పడుతున్నట్టు కొన్ని రోజులుగా గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా మిస్ ఇండియా కాగా దానిని కొత్త దర్శకుడు నరేంద్ర నాథ్ డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ పీఆర్వోగా ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం నిర్మాతగా మారిన మహేష్ కోనేరు ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియ, కమల్ కామరాజు, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

ఏప్రిల్ 17 న రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ సినిమాని కూడా ఆమెజాన్ సంస్థ కొనుగోలు చేసిందని యా మధ్య ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని, ఈ సినిమని నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని కూడా అన్నారు. అయితే మొన్న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఈ సినిమా నిర్మాత మహేష్ కోనేరు సినిమా ప్రచారాన్ని గట్టిగా చేసేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: