హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ను అద్దెకు ఇస్తుందట.. ఇదేం విడ్డూరం రారా బాబు.. అనుకుంటున్నారా..అవును మీరు విన్నది నిజమే.. వినడానికి వింతగా ఉంది కదా ..
అయితే ఇప్పుడు జరిగింది కూడా అదే..  ఓ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ను అద్దెకు ఇస్తానని ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..తెలుగులో మంచి సక్సెస్ ను అందుకున్న సినిమా కేరింత.. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నటుడు విశ్వంత్ దుద్దుంపూడి..



మనమంత’, ‘జెర్సీ’, ‘తోలు బొమ్మలాట’, ‘ఓ పిట్టకథ’ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా మరో చిత్రంలో నటించబోతున్నాడు.ఈ సినిమానే బోయ్‌ఫ్రెండ్ ఫర్ హయర్’. మాళవిక సతీషన్ హీరోయిన్. సంతోష్ కంభంపాటి దర్శకుడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉంది.



అయితే ఈ సినిమా ప్రమోషన్  పనులలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.ఈ మేరకు ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో హీరో , హీరోయిన్లు కొత్తగా కనిపిస్తారు. హీరో ను హీరోయిన్ మోసుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తుంది.దాంతో పోస్టర్ ఆసక్తిగా మారింది.టైటిల్ కూడా ఇంట్రస్టింగ్‌గా ఉంది. బోయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు ఇవ్వడమేంటో సినిమా చూస్తే కానీ తెలీదు. ఈ చిత్రాన్ని స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై వేణుమాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు విజయ్ వర్ధన్ ఎడిటర్. పూజా రామచంద్రన్, మధు నందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..పోస్టర్ ఆకట్టుకున్నట్లు సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: