ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ దృష్టి అంతా ‘ఆర్ ఆర్ ఆర్’ పైనే ఉంది. ఈ మూవీ క్రియేట్ చేసే  రికార్డులను బట్టి భవిష్యత్ లో మరిన్ని అత్యంత భారీ సినిమాలు నిర్మాణం అయ్యే ఆస్కారం ఉంది. జాతీయ స్థాయిలో ఈ మూవీ సాధించే ఘనవిజయం బట్టి జాతీయ స్థాయిలో దర్శకుడిగా రాజమౌళి స్థానం నిర్ణయింప పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విడుదల అయ్యే సమయానికి గతంలో పవన్ కళ్యాణ్ మూవీ ఎదుర్కున్న సమస్యలు ‘ఆర్ ఆర్ ఆర్’ కూడ  ఎదుర్కున బోతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.


‘ఆర్ ఆర్ ఆర్’ మూల కధలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ఒక ప్రాంతంలో కలుస్తారు అన్నఊహ చుట్టూ అల్ల బడిన కధ. చరిత్రలో లభిస్తున్న ఆధారాల ప్రకారం కొమురం భీమ్ గోండు జాతి యోధుడు ఆషాఫ్ జాహీ వంశీకుల పై పోరాడిన వ్య‌క్తి ఆయ‌న స్ఫూర్తి ఒక చ‌రిత్ర‌. ఇంత గొప్పదనంకలిగిన కొమరం భీమ్ చ‌రిత్ర‌ను  సినిమాగా తీస్తే ఎవ‌రికీ అభ్యంత‌రం ఉండదు. అయితే ఆయ‌న పేరును ‘ఆర్ ఆర్ ఆర్’ క‌థ‌కు అనుగుణంగా వాడుకోవ‌డాన్ని ఆయ‌న వార‌సులు ఆయ‌న అభిమానులు ఏమాత్రం ఒప్పుకోరు అన్నవిషయం గత సంఘటనలు బట్టి తెలుస్తుంది.


దాదాపు ప‌దేళ్ల కింద‌ట‌ కొమరం భీమ్ పేరును సినిమా టైటిల్ గా ఉప‌యోగించుకోవ‌డం ప‌ట్ల ఒక వివాదం రేగిన విషయాన్ని ఇప్పుడు ఇండస్ట్రీలోని కొందరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆ సంఘటన గతంలో పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించింది. ఎస్.జె. సూర్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా వ‌చ్చిన ‘పులి’ సినిమాకు ముందుగా పెట్టిన పేరు కొమరం పులి. ఆసినిమాను ఆ పేరుతోనే ప్ర‌చారం చేశారు. కొమరం భీమ్ ఇంటి పేరును కొమ‌రంగా మార్చేసి కొమ‌రం పులి అని టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఆసినిమా ఆడియో విడుద‌ల వ‌ర‌కూ ఆసినిమా పేరు కొమ‌రం పులి అనే ప్రచారం జరిగింది.


అయితే ఆ క‌థ‌తో సంబంధం లేకుండా త‌మ యోధుడి ఇంటి పేరును వాడుకోవ‌డం ప‌ట్ల అప్పట్లో  కొమరం భీమ్ కుటుంబీకులు భీమ్ అభిమానులు అభ్యంత‌రం చెప్పడమే కాకుండా ఆ సినిమాను బ‌హిష్క‌రిస్తామ‌ని అప్పట్లో హెచ్చరికలు కూడ వచ్చాయి. దీనితో అప్పట్లో అలెర్ట్ అయిన నిర్మాతలు పవన్ సినిమాలోని కొమ‌రం పేరును తొల‌గించి పులి గా విడుద‌ల చేశారు. ఆ సినిమా  అప్పట్లో ఘోరమైన ఫ్లాప్. ఆ సంఘటన జరిగిన పదేళ్ళ తరువాత ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కధలో కొమరం భీమ్ పేరును వాడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రయోగాన్ని తెలంగాణా ప్రాంతంలోని కొమరం భీమ్ అభిమానులు అంగీకరించకపోతే ‘ఆర్ ఆర్ ఆర్’ కూడ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది అంటూ కొందరు ఊహా గానాలు చేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: