తెలుగు లో బిగ్ బాస్ సీసన్4 విజయవంతంగా ఇప్పటికే ఆరు  వారాలు పూర్తి చేసుకుంది. ఇక  గత ఆరువారాలకి హోస్ట్‌గా ఉన్న నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం మనాలీ వెళ్ళగా, ఆయన స్థానాన్ని కోడలు సమంత భర్త చేస్తుంది .  శనివారం ఎపిసోడ్ హోస్ట్ లేకుండా సాగిపోగా, ఆదివారం రోజు సమంత ఇంటి సభ్యలతో సందడి చేసింది.ఇక బిగ్ బాస్ వేదికపై సమంత మాట్లాడిన పద్దతి అవన్నీ చూస్తుంటే సోషల్ మీడియాలో సమంత హోస్టింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంది. సేవ్ చేసినపుడు కానీ.. ఎలిమినేట్ చేయాల్సి వచ్చినపుడు కానీ సమంత చాలా కూల్‌గా.. సెటిల్డ్‌గా కనిపించింది. తనకు హోస్టింగ్ చేయడం అలవాటు లేదంటూనే చాలా అద్భుతంగా చేసింది సమంత. అక్కినేని కోడలా మజాకా అనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే బిగ్ బాస్ వేదికపై సొంత విషయాలు కూడా పంచుకుంది సమంత.మోనాల్ విషయంలో కూడా చిన్నసైజ్ క్లాస్ తీసుకుంది సమంత.

 ఇంట్లో ప్రతీ చిన్న విషయానికి ఏడుస్తూనే ఉంటుంది మోనాల్. అది చాలా మందికి నచ్చదు కూడా.. ఈ విషయం కూడా అందరికీ తెలుసు. ఆమెను ఏడుపు ఆపాలంటూ నాగార్జున కూడా చాలాసార్లు చెప్పాడు. కానీ వినలేదు.. ఇప్పుడు సమంత కూడా చెప్పింది. కాకపోతే తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చింది సమంత. చీటికి మాటికి వచ్చే ఏడుపుకు అస్సలు విలువ ఉండదంటూ కాస్త గట్టిగానే చెప్పింది సమంత.అలా చేయొద్దని.. ఊరికే ఏడవొద్దని.. అలా చేసినపుడు ఎదుటి వాళ్లకు కోపం వస్తుందని.. అదే ఎందుకు ఏడుస్తున్నామో క్లియర్‌గా మాట్లాడి సమస్యను సాల్వ్ చేసుకుంటే బాగుంటుందని మోనాల్‌కు సమంత సూచించింది.

 తన ఇంట్లోనూ నాగ చైతన్య కోప్పడతాడని.. తమ మధ్య గొడవలు కూడా అవుతుంటాయని పర్సనల్ విషయాలను చెప్పింది సమంత. ఆ సమయంలో తాను ఏడిస్తే ఇంకా కోప్పడతాడని చెప్పుకొచ్చింది. అదే క్లియర్‌గా విషయం ఏంటో చెబితో అర్థం చేసుకుంటాడని.. గొడవ అక్కడితోనే సమసిపోతుందని చెప్పుకొచ్చింది సమంత. అక్కినేని కోడలు చెప్పిన విధానం చూసి చాలా మంది ఫిదా అయిపోయారు.మొత్తానికి సమంతా బిగ్ బాస్ వేదికపై తన కుటుంబ విషయాలను హౌస్ మేట్స్ తో పంచుకోవడం అనేది ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: