టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగా మేనల్లుడు గా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరంతేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. మేనమామ చిరంజీవి పోలిక లతో  ఉండే సాయి ధరమ్ తేజ్ తన నటనలో చిరంజీవి హావభావాలను కూడా అచ్చు గుద్దినట్లు దింపే స్తూ ఉంటాడు. అందుకే అభిమానులు సాయి ధరంతేజ్ నటనకు ఎంతగానో ఆకర్షితులు అవుతున్నారు. ఇక వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న సాయి ధరంతేజ్ ప్రస్తుతం వరుస విజయాలను కూడా అందుకుంటున్న  విషయం తెలిసిందే. గతంలో వరుస ప్లాపులతో సతమతమైన సాయి ధరంతేజ్ తర్వాత మాత్రం విజయాలు అందుకుని ట్రాక్ లోకి వచ్చాడు.



 ఇక ఇటీవలే సాయి ధరంతేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటించగా  ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.  మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా అందరి పెళ్లిళ్లు జరిగిపోతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా  ఉన్న హీరోలందరూ ప్రస్తుతం పెళ్లి  చేసుకుంటూ ఓ  ఇంటి వాళ్ళు అవుతున్నారు ఈ క్రమంలోనే సాయి ధరంతేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అనే టాక్ టాలీవుడ్ లో మొదలైంది. త్వరలో సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్త అభిమానులు విన బోతున్నారు అంటూ వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది.



 తాజాగా పెళ్లి వార్తలపై సాయిధరమ్తేజ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే పెళ్లి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అంటూ తెలిపిన సాయి ధరంతేజ్.. ఒకవేళ ఇంట్లో వాళ్లు సంబంధం చూసి అమ్మాయి బాగుందని ఒత్తిడి చేస్తే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటూ తెలిపాడు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తాం అంటే చూసుకోండి అని కూడా చెప్పాను కానీ అంతకంటే ముందే మీడియా వాళ్లు నా పెళ్లి వెనక పడ్డారు అంటూ సాయి ధరంతేజ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే సాయి ధరం తేజ్ హీరోగా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నో పెళ్లి దీని తల్లి అంటూ ఓ పాట ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సాయి ధరంతేజ్ కూడా ఇదే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: