బిగ్ బాస్ 4లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా అఖిల్ తన ఆట ఆడుతున్నాడు. అయితే అఖిల్ మొదట్లో ఉన్నంత ఫోకస్ గా ఆట ఆడట్లేదని తెలుస్తుంది. రెండో వారం నుండే అఖిల్ మోనాల్ తో జత కట్టడం ఆమెతో క్లోజ్ అవడం జరుగుతుంది. మోనాల్ పై అతనికి ఉన్న ఎఫెక్షన్ మరీ సీరియస్ అవుతుందని తెలుస్తుంది. అది తన ఆటని సరిగా ఆడలేనంతగా చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ వారం నామినేషన్స్ లో అఖిల్ అమ్మా రాజశేఖర్ తో గొడవ కూడా అతని ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది.

అఖిల్ వర్సెస్ అమ్మా రాజశేఖర్ గొడవలో తప్పు ఎవరిది అన్నది పక్కన పెడితే అఖిల్ అలా ముందుకొచ్చి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని కొందరి టాక్. అఫ్కోర్స్ అదే నామినేషన్స్ లో అరియానా అదే విషయాన్ని ప్రస్థావించింది కూడా. అసలైతే అఖిల్ టాప్ 5 హౌజ్ మేట్ అని చెప్పుకున్నా అతను చేస్తున్న ఈ పనుల వల్ల వెనకపడుతున్నాడు. తప్పకుండా అఖిల్ టాప్ 5లో ఉంటాడని చెబుతున్నా తప్పకుండా ఈమధ్య అతను చేస్తున్న వ్యవహారలు అతన్ని టాప్ 5లో లేకుండా చేస్తాయని అంటున్నారు.

మరి అఖిల్ బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 5లో ఉంటాడా లేదా అన్నది చూడాలి. తప్పకుండా అఖిల్ టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉన్నా రాబోయే వారాల్లో అతను మోనాల్ కోసం ఇంకా సేవ్ గేం ఆడితే మాత్రం తప్పకుండా అతని మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఆల్రెడీ అభిజిత్, లాస్య, అవినాష్ టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. అరియానా కూడా టాప్ లో ఉంటుందని అంటున్నారు. మరి మెహబూబ్, సోహెల్, అఖిల్ లో ఎవరు టాప్ 5లో ఉంటారో చూడాలి.         

మరింత సమాచారం తెలుసుకోండి: