జగపతిబాబు సీనియర్ నటుడు. అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంత గానో మెప్పించాడు అప్పట్లో హీరోగా నటించి ప్రజాదరణ పొందిన ఈ నటుడు ఇప్పుడు తండ్రి పాత్ర లో నటిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో యాంగ్ రొమాంటిక్ హీరో అయిన ఈ హీరో అప్పట్లో శోభన్ బాబు తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ఆంధ్రుల అందగాడు. సినిమాల పై  మక్కువ తో ఇండస్ట్రీ కి వచ్చి ఈ రంగం లో ఎంతో అద్భుతంగా రాణించాడు.

చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి లేదు. చదువు అంటే అసలు పడదంట. ఏదైనా నచ్చకపోతే దాని జోలికే పోడు. ఇది ఇలా ఉండగా  తండ్రి నిర్మాత కావటంతో కెరీర్ ప్రారంభం లో సొంత బేనర్ లో సినిమాలు చేసాడు. సినిమాలు హిట్ కాకపోవటం మూలం గానే కొంత నిరాశకు కూడా గురి అయ్యాడు జగపతి బాబు. ఆ తర్వాత కొంచెం మంచి హిట్లు దొరకడం వల్ల కొంచెం పరిస్థితి చక్కబడిన జల్సారాయుడు కావటం, జూదాలు ఆడటం మరియు అడిగిన వారికీ కాదని అనకుండా డబ్బులు ఇవ్వటం అవి తిరిగి రాకపోవటం తో నష్టం కలిగింది ఈ హీరోకి. అలానే ఫ్రెండ్స్ తో విచ్చలవిడిగా ఖర్చు చేయటం, అతిగా దానాలు చేయటం వలన ఉన్న ఆస్తిని నిలబెట్టుకోలేకపోయాడు. వీటి వల్లే ఆర్ధికంగా చాలా వెనకపడ్డాడు.

కానీ అదృష్టం బాగుంది. హీరో అయిన జగపతి బాబు కి  ఆ విలన్ గా అవకాశాలు రావడం తో పరిస్థితి మెరుగు పడింది.  లెజెండ్  వంటి సినిమాలో విలన్ గా చేయటంతో  అక్కడి నుంచి వరుసగా విలన్ గా సినిమాలు చేస్తూ ఆర్ధికంగా స్థిరపడ్డాడు జగపతి బాబు. ఇప్పుడిప్పుడే ఎంతో కొంత వెనకేసుకుంటున్నా.. అని అంటున్నాడు జగపతి బాబు. ఈయనకి ఇప్పటి వరకు జగపతికి సొంత ఇల్లు కూడా లేదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: