అవునూ.. గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తల్లి తను చేసిన ఓ తెలివి తక్కువ పని గుర్తు చేసుకుంది. అది కూడా దేశం గుర్తించే సంఘటనలో భాగం అయిన సందర్భంలోనే కావడం విశేషం. అయితే ఆ సందర్భం ఏంటి? ఎపుడు జరిగింది? ఎవరిని తెలివి తక్కువగా ప్రశ్నించింది? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా మిస్‌ వరల్డ్‌ నాటి సంఘటనను గుర్తు చేసుకుని ఆ క్షణంలో చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలను తాజాగా పంచుకున్నారు. 2000లో మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలుచుకున్న వీడియోను ప్రియాంక మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అంతేగాక తను కిరీటం ధరించిన అనంతరం ఆమె తల్లి మధు చొప్రా తనతో చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.  "మిస్‌ వరల్డ్‌ 2000 నాటి వీడియో ఇది. అప్పుడే నాకు 18 సంవత్సరాలు నిండాయి. మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకున్నాను. ఆ తర్వాత స్టేజ్‌పై నా కుటుంబాన్ని కలుసుకోవడం, శుభాకాంక్షలు తెలుపుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెంటనే మా అమ్మ నాతో 'బేబీ ఇప్పడు నీ చదువు సంగతేంటి? అన్నారు" అంటూ ఇన్‌స్టాలో ప్రియాంక రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ప్రియాంక తన తల్లిని "మామ్‌ నేను కిరీటం గెలుచుకున్న క్షణాలు గుర్తున్నాయా" అని అడిగింది. దీనికి ఆమె తల్లి సమాధానం ఇస్తూ.. ముగ్గురు ఫైనలిస్టులో నిన్ను విన్నర్‌గా ప్రకటించగానే హాల్‌ అంతా చప్పట్లు, అరుపులతో మోరుమ్రోగింది. ఆ క్షణం​ నేను భావోద్వేగానికి లోనయ్యాను. నా కళ్ల నిండా నీళ్లు తిరిగాయి. నేను నిన్ను కౌగిలించకున్నాక ​కిరీటం గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నానని, నీకు శుభాకాంక్షలు తెలిపడానికి బదులుగా బేబీ ఇప్పుడు నీ చదువు విషయం ఏంటి అని తెలివి తక్కువగా ప్రశ్నించాను అంటూ గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ప్రియాంక సోదరుడు కూడా వీడియో కాల్‌ ద్వారా మాట్లాడుతూ.. తన సోదరి మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకున్న ఆ క్షణంలో తనలో మెదిలిన ఆలోచనలు పంచుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: