అవునూ.. సింగర్ మంగ్లీ తెలుగు బిగ్ బాస్ షోలో ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు రేటింగ్ మొదటి ఒకటి రెండు వారాలు మంచి రేటింగ్ వచ్చినా ఆ తర్వాత తర్వాత రేటింగ్ దారుణంగా పడిపోయింది అనేది బుల్లి తెర వర్గాల వారి టాక్. బిగ్ బాస్ నిర్వాహకులు రేటింగ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం అవ్వలేక పోతున్నారు. అందుకే ఇపుడు మంగ్లీని హౌజ్ లోకి పంపుతున్నట్లు సమాచారం. అయితే ఆ విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. తెలుగు బిగ్ బాస్ షో 4వ సీజన్ మొదలైన ఇప్పటికీ దాదాపుగా 8 వారాలు పూర్తి చేసుకుంది. అయితే మొదటి రెండు మూడు వారాలు మినహా పెద్ద చెప్పుకోదగ్గ రేటింగ్ అందుకోవడం లేదని సమాచారం. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బిగ్ బాస్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అపుడపుడు ఫలిస్తున్నా ఐపీఎల్ నుండి గట్టి పోటీ ఎదుర్కుంటుంది. అంతేకాకుండా కొన్ని సీరియల్స్ చేసే హంగామా కూడా బిగ్ బాస్ పాలిట శాపంగా మారుతోందని ఇన్ సైడ్ టాక్. మొన్నటి ఆదివారం హీరోయిన్ సమంతను గెస్ట్ హోస్ట్ గా తీసుకు వచ్చి ఏకంగా మూడు గంటల పాటు మారథాన్ ఎపిసోడ్ ను నిర్వహించారు. ఆ ఎపిసోడ్ కు కూడా జస్ట్ ఓకే అన్నట్లుగానే మార్కులు పడ్డాయట. మళ్లీ వీక్ డేస్ లో రేటింగ్ వీక్ గానే వస్తున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ షోలో వాతావరణంను మార్చేందుకు నిర్వాహకులు మరో వైల్డ్ ఎంట్రీని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సారి సింగర్ మంగ్లీని హౌజ్ లోకి పంపుతున్నట్లు సమాచారం. ఆమెను హౌజ్ లోకి పంపించేందుకు నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రచారం. ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేశారని.. ఆమె ఒప్పుకుందనే వార్తలు కూడా వస్తున్నాయి. గత వారం రోజులుగా మంగ్లీ క్వారెంటైన్ లో ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. మంగ్లీకి మంచి క్రేజ్ ఉంది.  ఆమె ఎంట్రీతో ఖచ్చితంగా షోకు అదనపు ఆకర్షణ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు జరిగాయి. అందులో అవినాష్ ఒక్కడే నిలబడ్డాడు. కమెడియన్ కుమార్ సాయి, హీరోయిన్ స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారు. మరి మంగ్లి అయినా బిగ్ బాస్ షో రేటింగ్ పెంచుతుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: