మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే ఫ్యాన్స్ లో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతాయి. అదే చిరంజీవి ఇండస్ట్రీ నెంబర్ వన్ దర్శకుడితో సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాల స్థాయి ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టం. సరిగ్గా 31 ఏళ్ల క్రితం ఆ అద్భుత కలయికకు తెర లేచింది. తిరుగులేని స్టార్ డమ్ తో దూసుకుపోతున్న చిరంజీవితో దాసరి సినిమా అంచనాలు పెంచేసింది. చిరంజీవి మార్క్ మాస్.. దాసరి మార్క్ సెంటిమెంట్ కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమానే ‘లంకేశ్వరుడు’. భారీ అంచనాల మధ్య 1989 అక్టోబర్ 27న విడుదలైంది లంకేశ్వరుడు.

సినిమాలో చిరంజీవి మాస్ లుక్, గెటప్, పక్కన చిరుతపులి.. ఇలా స్టిల్స్ తోనే ఫ్యాన్స్, ఆడియన్స్, ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు పెంచేసింది. మెస్మరైజింగ్ డ్యాన్సులతో, ఫైట్లతో చిరంజీవి తిరుగులేని స్టార్ డమ్ తో ఉన్నారు. ఎప్పటిలా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అయితే.. సినిమాలో చిరంజీవి నుంచి ఎంటర్ టైన్మెంట్ కంటే సెంటిమెంట్ ఎక్కువైంది. ముఖ్యంగా సెకండాఫ్ లో చిరంజీవి పాత్ర ఫ్యాన్స్ కు ఎక్కలేదు. సెంటిమెంట్ పండించడంలో దాసరి దిట్ట. అలా.. సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనుకున్న వారి అంచనాలు తప్పాయి. దీంతో సినిమా ఫలితంపై ప్రతికూల ప్రభావం చూపింది.

 అయితే.. చిరంజీవి రేంజ్ ఓపెనింగ్స్, కలెక్షన్లకు కొదవ లేదు. రాజ్-కోటి మ్యూజిక్ సినిమాకు ప్లస్. పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ‘పదహారేళ్ల వయసు..’ పాటలో చిరంజీవి స్టెప్స్ సంచలనం రేపాయి. చిరంజీవి చెల్లిగా రేవతి.. బావగా కల్యాణ్ చక్రవర్తి నటించారు. విజయ మాధవి కంబైన్స్ బ్యానర్ పై వడ్డే రమేశ్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి – దాసరి కలిసి మరో సినిమా చేయలేదు. దీంతో వీరద్దరి కాంబినేషన్ లో వచ్చింది ఒక సినిమానే అయినా మిస్ ఫైర్ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: