సినీ పరిశ్రమలో ఇప్పుడు నటన ఉంటే చాలు అనే విధంగా పరిస్థితి ఉంది అనే మాట అక్షరాలా నిజం. ఎవరైనా సరే బాగా నటిస్తే చాలు వారికి మంచి మంచి ఆఫర్లు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో నటించే వారైనా చిన్న హీరోల సినిమాల్లో నటించే వారైనా సరే ఇప్పుడు నటన ఉంటే చాలు. వారి కెరీర్ చాలా వేగంగా దూసుకుపోతోంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం మన తెలుగు లో ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే చాలా వరకు కూడా నటన మీదనే దృష్టి పెట్టాలని దర్శకనిర్మాతలు సూచనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొంతమంది హీరోయిన్లు కాస్త ఎక్కువగానే  కష్టపడుతున్నారు. తాజాగా వస్తున్న పుష్ప సినిమాలో రష్మిక మందన మద్యానికి బానిసైన అమ్మాయిలా కనబడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక తెగకు చెందిన మహిళగా ఆమె నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఆమెకు తల్లి తండ్రులు చనిపోతారని... ఈ నేపథ్యంలోనే ఆమె మద్యానికి బానిస అవుతుంది అని ఆ తర్వాత అల్లు అర్జున్ ఆమెకు పరిచయం అవుతాడని ఆ తర్వాత ఆమె  జీవితం మారిపోతుంది అని అంటున్నారు.

ఆమెకు ఈ సినిమాలో తల్లిదండ్రులు ఉండరు  అంటున్నారు. దీనితోనే ఆమె మద్యానికి బానిసై ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి ఇంకా ఎలాంటి స్పష్టత కూడా రాలేదు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఒక లుక్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఈ సినిమా మాత్రం హాట్ టాపిక్ అయింది. ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: