మన తెలుగులో ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఇతర భాషల హీరోయిన్లను ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయటం లేదు. అనవసరంగా వారికి ఎక్కువగా ఖర్చు పెట్టడం ఇష్టం లేక కొంతమంది దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు అనే భావన టాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కొంత మంది సీనియర్ హీరోయిన్లు కూడా పక్కన పెట్టేసి అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. తెలుగులో సినిమాలు చేయాలంటే నయనతార ముందు నుంచి కూడా చాలా ఇబ్బందులు పెడుతుంది.

ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేయడంతో దర్శక నిర్మాతలకు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో ఆమెను పక్కన పెట్టాలని భావిస్తోంది టాలీవుడ్. తాజాగా ఆమె ఒక సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే పక్కన పెట్టేశారు అని అంటున్నారు. మరి దీని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదు గాని దాదాపుగా ఆమె బాలకృష్ణ సినిమాలో నటించడానికి మూడు నుంచి నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేసిందని అంటున్నారు. దీనితో ఆమెను తెలుగులో పక్కన పెట్టారని అంటున్నారు.

అటు చిరంజీవి సినిమాలో కూడా ఆమెను తీసుకొని ఆలోచన చేసినా సరే ఆ తర్వాత వెనక్కి తగ్గారట. మరి భవిష్యత్తులో అయినా సరే ఆమెను తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఇక త్రిష విషయానికి వస్తే టాలీవుడ్ లో ఒకప్పుడు చక్రం తిప్పింది. అయితే ఆ తర్వాత మాత్రం ఆమెకు వరుసగా అవకాశాలు ఆగిపోయాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆమె తెలుగులో సినిమాలు చేయాలని భావించిన సరే ఆమెకు మాత్రం అవకాశం ఇవ్వడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. అటు అనుష్క పరిస్థితి కూడా దాదాపుగా ఇదే విధంగా ఉందని అంటున్నారు. ఆమె వయసు దాదాపు నలభై ఏళ్లు కావడంతో ఇక పక్కన పెడితే మంచిది అని వ్యాఖ్యానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: