అవునూ.. "పెళ్ళి సందడి" సినిమా రీమేక్ లో హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించనున్నాడు. అయితే తాజాగా హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంతో ఈ విషయం తెలిసింది. అయితే ఆ విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. "పెళ్ళి సందడి". అప్పట్లో ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ కి హీరోగా స్టార్ డం తీసుకొచ్చిన సినిమా ఇదే. కె రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన సంగీతం ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు అదే పేరుతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల రాఘవేంద్రరావు వెల్లడించారు. అయితే ఈ సినిమాలో నటించే హీరో హీరోయిన్ల పేర్లు మాత్రం వెల్లడించలేదు. అయితే తాజాగా ఈ చిత్రంలోని కథానాయకుడిని పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. రోషన్‌ ఇందులో కథానాయకుడిగా నటించనున్నాడు. హీరో శ్రీకాంత్, ఊహల తనయుడే ఈ రోషన్.
ఇదిలా ఉంటే.. రోషన్ "నిర్మలా కాన్వెంట్" అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కింగ్ నాగార్జున ఆ సినిమాను నిర్మించాడు. అయితే ఇపుడు తన తండ్రికి స్టార్ డం తీసుకొచ్చిన సినిమా రీమేక్ లో చేస్తున్నాడు రోషన్. ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థతో కలసి ప్రముఖ నిర్మాత కె.కృష్ణమోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించనున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు.   అయితే మరోమారు ఇంకో విషయం దాచి పెట్టారు. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం బయట పెట్టలేదు. అయితే మరో వీడియోలో హీరోయిన్ ను కూడా పరిచయం చేస్తారేమో చూడాలి. ఈ సినిమాతో రోషన్ మంచి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటూ.. ఆల్ ది బెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: