టాలీవుడ్ అగ్ర హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమానే RRR. పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.అల్లూరిగా, చెర్రీ... కొమురం భీంగా తారక్ నటిస్తున్నాడు.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్, చరణ్ తాలూకు ఇంట్రో వీడియో లకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ఇక నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ పాత్ర కు సంబంధించిన టీజర్ ఇటీవల అక్టోబర్ 22 న కొమురం భీం జయంతి సందర్భంగా విడుదల చేసింది మూవీ యూనిట్. రామ్ చరణ్ వాయిస్‌, ఎన్టీఆర్ విజువల్స్ ఆడియన్స్‌కు మంచి ట్రీట్ అందించాయి.

 రికార్డుల మోత మోగిస్తున్న ఈ టీజర్‌ని కొందరు కుర్రాళ్ళు యధావిధిగా దింపి అందరిని షాక్‌కు గురిచేశారు.రామ్ చరణ్ ప్రోమోను కూడా అచ్చం దింపేయగా, వీరి టాలెంట్‌కు ఫిదా అయిన ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్‌లో వీడియోలను షేర్ చేసింది.కుర్రాళ్ళు చింపేశారు అని కామెంట్‌లో పేర్కొంది.ఇక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఈ స్పూఫ్ కి ఫిదా అవుతూ... అచ్చం ఎన్టీఆర్ ని దించేసాడు అంటూ ఆ కుర్రాడ్ని పొగడ్తలతో ముంచేస్తున్నారు.ఇక గతంలో చరణ్ అల్లూరి ఇంట్రో వీడియోని కూడా స్పూఫ్ చేసి శభాష్ అనిపించుకున్నారు.

  ఇక  ఆర్ఆర్ఆర్ చిత్రం చరిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా రూపొందుతుంది. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవలే మొదలైంది.వచ్చే ఏడాది జూన్ లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: