డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ "రొమాంటిక్" అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. అయితే ఈ సినిమా కూడా ఓటీటీ లోనే రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతకీ ఏ ప్లాట్ ఫాం ద్వారా రిలీజ్ కానుంది? ఎపుడు రిలీజ్ కానుంది? ఇంతకీ ఇది నిజమేనా? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ ప్రస్తుతం "రొమాంటిక్" అనే సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అనిల్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ సినిమాకు మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా దీపావళి లోగా పూర్తి అవనుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా త్వరలో ఓటీటీ ద్వారా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. అమెజాన్ ప్రైమ్‌ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్స్ తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో, ఇప్పుడు యంగ్ హీరో ఆకాష్ పూరీ చిత్రం కూడా అదే బాటలో రానుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే "ఆంధ్రా పోరి", "మెహబూబా" అనే రెండు సినిమాలు చేశాడు. కానీ అవి విజయం సాధించలేదు. మరి ఈ మూడో సినిమా అయినా ఆకాష్ కోరుకున్న హిట్ ఇస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: