పూరి జగన్నాధ్.. యావత్ తెలుగు సినీ పరిశ్రమలోనే ఏకైక తెలివైన డైరెక్టర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్దగా కథ లేకుండా కేవలం కథనంతోనే సినిమాను రక్తి కట్టించడం కేవలం పూరీకే చెల్లింది. అందుకే ఎందరో క్రిటిక్స్ పూరి సినిమాలను ప్రత్యేకంగా చూస్తారు. పూరి ప్లాప్ సినిమాకు కూడా ఓ రేంజ్ ఉంటుంది. అది ప్లాప్ అని తెలిసి కూడా ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్తాడు. అది.. పూరి మేకింగ్ స్టయిల్ కి వున్న స్ట్రెంగ్త్.

బద్రి సినిమాతో మొదలైన పూరి ప్రస్థానం నిన్న మొన్నటి ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. పూరి సినిమాలను అభిమానులు ముద్దుగా చాలా హాట్ సినిమాలు అని పిలుస్తూ వుంటారు. ఎందుకంటే ఒక మాస్ ఆడియన్ కు ఏమి కావాలో పూరికి బాగా తెలుసు. అదే టైంలో క్లాస్ ఆడియన్స్ ను ఆలోచింపజేసేలా పూరి రాసిన డైలాగులు న భూతో న భవిష్యతి.

మనం గమనించినట్లయితే నిన్నటి సినిమా ఇస్మార్ట్ శంకర్ వరకూ ఏ సినిమా చూసుకున్నా పూరి మార్క్ స్పష్టంగా కనబడుతుంది. అందులో ముఖ్యంగా రెండు సినిమాలను తీసుకుంటే కంప్లైట్ పూరి మార్క్ మసాలా హాట్ సినిమాలను మనం గమనించవచ్చు. అందులో ఒకటి పోకిరి, రెండు మొన్న రిలీజైన ఇస్మార్ట్ శంకర్. ఈ రెండు సినిమాలను నిశితంగా పరిశీలిస్తే పూరి ఫిలాసఫీ వీటిలో స్పష్టంగా కనబడుతుంది.

ఇకపోతే ఫిలాసఫీ చెప్పడంలో పూరి స్టయిలే వేరు. సామాన్య జనానికి కూడా అర్ధమయ్యే రీతిలో తత్వాన్ని బోధించడం పూరీకే చెల్లింది. ఇది ఇంకే దర్శకుడికీ చేతకాని ఓ అరుదైన కళ. అందుకే పూరీని అందరూ ఇష్టపడతారు. భారత దేశం గర్వించే సినిమాలు తీస్తున్న మన జక్కన్నకు కూడా పూరి సినిమాలంటే మంచి గురి. ఆ అభిప్రాయాన్ని రామౌళి ఓ సారి సభాముఖంగానే తెలియజేసాడు. ఇకపోతే మరో హాట్ సినిమా చిత్రీకరణలో మరో హాట్ యాక్టర్ అయినటివంటి రౌడీ విజయ్ తో దుమ్ము దులపనున్నాడు మన పూరి జగన్నాధ్.

మరింత సమాచారం తెలుసుకోండి: