ఈటివికి సూపర్ రేటింగ్ ఇచ్చేలా చేసిన జబర్దస్త్ షో ఆరేడేళ్లుగా అప్రతిహాతంగా కామెడీ షోలో నంబర్ 1 గా నిలిచేలా చేశారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు వచ్చేది ఈటివిలో అయినా ఈటివికి వారికి ఎలాంటి సంబంధం లేదు.. మల్లెమాల వారు దానికి నిర్మాతలు. కమెడియన్లకు ఎమౌంట్ ఇచ్చేది కూడా స్పాన్సర్స్ ఇంకా మల్లెమాల వారే. ఇదిలాఉంటే జబర్దస్త్ టీం లో కొందరు ఈమధ్య నిరసన జ్వాలలు చేశారు. ఇక్కడ ఉంటే ఉండండి పోతే పోండి అని వారి వాదన అని టాక్ వచ్చింది.

అందుకే ఈమధ్య జీ తెలుగులో అదిరింది అంటూ ఓ కొత్త షో స్టార్ట్ చేసి అక్కడ కనిపించారు కొందరు జబర్దస్త్ కమెడియన్లు. జబర్దస్త్ డైరక్టర్స్ బయటకు వెళ్లి అదిరింది షో చేస్తున్నారని తెలిసిందే. ఇదిలాఉంటే జబర్దస్త్ కమెడియనలు క్రేజ్ బాగానే ఉన్నా వారికి వచ్చే సంపాదన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అందుకే జబర్దస్త్ ను వీడి అవినాష్ బిగ్ బాస్ కు వెళ్ళాడు. జబర్దస్త్ నుండి బిగ్ బాస్ కు వెళ్లడం అనేది ఓ పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు.

అయితే ఆప్పటివరకు ఈటివిలో తప్ప స్టార్ మా షోలు చేయని జబర్దస్త్ కమెడియన్లు ఇప్పుడు స్టార్ మాలో కూడా షోలు చేస్తున్నారు. స్టార్ మా దసరా ఈవెంట్లో జబర్దస్త్ స్టార్స్ కనిపించారు. ఇక అదే దసరా స్పెషల్ బిగ్ బాస్ ఎపిసోడ్ లో జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది కూడా కనిపించి అలరించాడు. జబర్దస్త్ తో సూపర్ క్రేజ్ వచ్చి బయట ఛానెల్స్ భారీ రెమ్యునరేషన్ ఇస్తామని ఆశపెడుతున్నా అందులోనే ఉంటున్నా అక్కడ జీతాలకు సాటిసఫై అవని వారు ఇక ఒక్కొక్కరుగా జంప్ జిలాని అవుతున్నారు. మరి ఇలానే చేస్తే జబర్దస్త్ నుండి అందరు బయటకు వచ్చి అక్కడ కొత్త వారు కనిపించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: