రాఘవ లారెన్స్.. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది. "ముని" సీరీస్. ఈ సీరీస్ కి దర్శకత్వం వహిస్తూ నటించారు లారెన్స్. ఇప్పటికే "ముని" సీరీస్ లో దాదాపుగా నాలుగు సినిమాలు రాగా అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. మొదట "ముని", "కాంచన", "గంగ", "కాంచన 3" వంటి సినిమాలు ఈ సీరీస్ లో ఉన్నాయి. అయితే రాఘవ లారెన్స్ దాదాపుగా ఇప్పటివరకు 8 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అయితే ఇపుడు ఆ సినిమాల లిస్టు మరియు వాటి ఫలితాలు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
1. మాస్: హిట్
ఈ సినిమాలో కింగ్ నాగార్జున హీరోగా జ్యోతిక హీరోయిన్ గా నటించారు. కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటించాడు. 
2. స్టైల్: సూపర్ హిట్
ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించాడు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభు దేవా కీలక పాత్రలో నటించారు. కమిలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించింది.
3. ముని: హిట్
ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు లారెన్స్. వేదిక హీరోయిన్ గా నటించింది. "ముని" సీరీస్ లో ఇది మొదటి సినిమా.
4. డాన్: ఫ్లాప్
ఈ సినిమాలో నాగర్జున, అనుష్క జంటగా నటించారు. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించాడు.
5. కాంచన: బ్లాక్ బస్టర్ హిట్
ఈ సినిమాకి లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించాడు. శరత్ కుమార్ కీలక పాత్రలో నటించాడు. రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నటించింది. ఇది "ముని" సీరీస్ లో రెండో సినిమా.
6. రెబల్: ఫ్లాప్
ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించాడు. దీక్షా సేథ్ హీరోయిన్ గా నటించింది. కృష్ణం రాజు కీలక పాత్రలో నటించారు.
7. గంగ: బ్లాక్ బస్టర్ హిట్
ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించాడు లారెన్స్. నిత్యా మీనన్, తాప్సీ హీరోయిన్లుగా నటించారు. ఇది "ముని" సీరీస్ లో మూడో సినిమా.
8. కాంచన 3: సూపర్ హిట్
ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించాడు లారెన్స్. ఈ సినిమాలో వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి హీరోయిన్లుగా నటించారు. ఇది "ముని" సీరీస్ లో నాలుగో సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: