అదేంటో తెలియదు కానీ ఒక జాడ్యం మాత్రం ఎంటర్ టైన్మెంట్ ఫీల్డ్ ని పట్టి పీడిస్తోంది. అందరూ నీతులు చెప్పేవారే. కానీ తమ దాకా వస్తే మాత్రం వేరేగా ఉంటారు. తేడా బాగా చూపిస్తారు. వినోద ప్రపంచం వెనక ఎంతో విషాదం ఉంది. నవ్వుల పువ్వుల వెనక కూడా ఎన్నో బాధల ముళ్ళులు ఉంటాయి. అందంగా కనిపించకపోతే వినోద ప్రపంచం తలుపులు వేసేస్తుంది. ఆ అందమే చివరికి శాపం కూడా అవుతోంది. కాస్టింగ్ కౌచ్ అన్న మాట ఇపుడు సర్వ సాధారణం అయిపోయింది. ఎందుకంటే ఈ మాటను  పెద్ద నుంచి చిన్న వరకూ అందరూ ఆర్టిస్టులూ ఎపుడో ఒకసారి తమ బాధలు చెప్పుకుంటూ వాడుతున్నదే.

నీకింతా నాకింతా అన్నది వ్యాపారంలో పద్ధతి. వినోద ప్రపంచంలో కూడా అలాంటిదే అమలు అవుతోంది. అయితే దీనికి కొంత మంది తలవొగ్గితే ఎక్కువ మంది మాత్రం తలెత్తి  తిరుగుబాటు చేస్తున్నారు. మహిళా చైతన్యం వెల్లి విరుస్తున్న ఈ వేళలో ఇంకా కొంతమంది ఏదో చేయాలని పాతకాలపు వాసనలతో కొట్టుకుపోతున్నరు. విషయానికి వస్తే తెలుగులో హాట్ యాంకర్లకు కొదవలేదు. వారిలో వర్షిణి సౌందర్యరాజన్ పేరు కూడా ఉంది.

తన అందం చందంతో ఆ అమ్మడు అనేక షోలు చేస్తూ పేరు తెచ్చుకుంది. తమిళనాడుకు చెందిన వర్షిణికి  హీరోయిన్ కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆమెకు కూడా వెండి తెర మీద కనిపించాలన్న ఆశ ఉంది. అయితే కరోనాకు ముందు ఒక వెబ్ సీరీస్ లో తనకు చాన్స్ ఇస్తారని కలవమంటే వర్షిణి ఒక డైరెక్టర్ ని కలిసిందట. ఆ డైరెక్టర్ మిస్ బిహేవ్ చేశాడని చాన్నాళ్ల తరువాత తాజాగా ఆ విషయం పంచుకుంది వర్షిణి.

అలా మిస్ బిహేవ్ చేయడానికి చూసిన ఆ డైరెక్టర్ నుంచి తప్పించుకుని బయటకు వచ్చి కారులో కూర్చుని చాలాసేపు ఏడిచానని ఆమె చెప్పుకుంది. అంతే కాదు తన బాధను ఎవరికీ చెప్పుకోలేక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ తో మాత్రమే పంచుకున్నానని కూడా అంటోంది. డైనమిక్ గా ఉంటూ మంచి టాలెంట్ తో రాణిస్తున్న వారినే ఈ కాస్టింగ్ కౌచ్ భూతం పట్టి పీడిస్తే నోరు వాయీ లేని అమాయకుల మీద పెద్ద పులిలా పడిపోతుంది అంటే నమ్మాలేమోగా. ఏది ఏమైనా ఈ విష సంస్కృతిని ఎంత తొందరగా తరిమికొడితే అంత త్వరగా వినోద రంగం బాగుపడుతుంది అన్న వాళ్ళు కూడా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: