కుర్ర హీరోలు దాదాపు సెట్స్‌పైకి వచ్చారు. ఎన్టీఆర్.. ప్రభాస్‌ వంటి స్టార్స్‌ కూడా కెమెరా ముందుకు వచ్చేశారు. చివరికి సీనియర్‌ హీరో నాగార్జున కూడా.. ఎవరికీ అందనంత ఎత్తులో షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇలా కరోనా తర్వాత మళ్లీ సందడి వాతావారణం నెలకుంటే .. సీనియర్‌ హీరోలు చిరంజీవి..బాలకృష్ణ.. వెంకటేశ్‌ నుంచి మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ రావడం లేదు. ఏజ్‌ రీత్యా 60 ప్లస్‌లో పడడంతో.. కరోనాకు ఈ ముగ్గురు భయపడుతున్నారా? షూటింగ్‌ విషయంలో సైలెంట్‌గా ఎందుకుంటున్నారనే అనుమానాలు సగటు ప్రేక్షకునిలో కలుగుతోంది.

సీనియర్‌ హీరోలందరూ షష్టిపూర్తి చేసుకున్నవాళ్లే. వయసు రీత్యా రిస్క్‌ చేయడం ఎందుకని..  షూటింగ్‌లో పాల్గొనడానికి భయపడుతున్నారనేది ఇన్‌సైడ్‌ టాక్‌. అయితే.. నాగార్జున మాత్రం  రెండు నెలల క్రితమే ఫేస్ కు రంగేసుకున్నాడు. అన్ని జాగ్రత్తలు తీసుకొని.. సముద్రమట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో వైల్డ్‌ డాగ్‌ షూటింగ్‌ లో పాల్గొన్నాడు.

నాగార్జునను చూసి యంగ్‌ హీరోలు ఇన్‌స్పైర్‌ అయి.. ఒక్కొక్కరుగా షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే.. సీనియర్‌ హీరోలు చిరంజీవి, వెంకటేశ్‌, బాలకృష్ణ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో తెలీయడం లేదు. మెగాస్టార్‌ కొరటాల దర్శకత్వంలో ఆచార్య మూవీలో.. బాలకృష్ణ బోయపాటి డైరెక్షన్‌లో.. వెంకటేశ్‌ నారప్పగా నటిస్తున్నారు. అదిగో ఇదిగో షూటింగ్‌ అంటూ వార్తలొచ్చాయేగానీ.. ఎప్పుడనేది కచ్చితంగా కన్ఫార్మ్‌ కాలేదు. దసరా తర్వాత షూటింగ్‌ మొదలవుతుందనుకుంటే.. ఇంతవరకు ఆ ఊసే లేదు.

సీనియర్స్‌ ఇప్పటివరకు సెట్స్‌పైకి రాకపోవడంతో... వీళ్ల సినిమాలు ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆచార్య షూటింగ్‌ ఆగస్ట్‌లో మొదలవుతుంది.. 2021 సంక్రాంతికి వస్తారనుకుంటే కుదరలేదు.  బాలయ్య, బోయపాటి మూవీ వారం రోజుల షూట్‌ మాత్రమే పూర్తిచేసుకుంది. నారప్ప షూటింగ్‌ ఇన్‌ఫర్మేషన్‌ చిత్ర యూనిట్‌ దగ్గరే లేదట. ఏడు నెలలుగా ఇంటికే పరిమితమైన ఈ ముగ్గురు సీనియర్స్‌.. నవంబర్‌లో అయినా సెట్స్‌పైకి వస్తారో లేదో చూడాలి. మొత్తానికి సీనియర్ హీరోలు.. షూటింగ్ లకు వెనుకడుగు వేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: