మన తెలుగు లో కొంత మంది హీరోయిన్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా రష్మిక మందన పూజా హెగ్డే సినిమాలకు కాస్త ఫ్యాన్స్ ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిణామాల ఆధారంగా చూస్తే వీరిద్దరికీ తెలుగులో డిమాండ్ పెరుగుతుంది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మరికొన్ని వార్తలు కూడా తెలుగులో కాస్త ఎక్కువగానే హల్చల్ చేస్తున్నాయి. అవి ఏంటి అనేది ఒక్కసారి చూస్తే వీరిద్దరికీ పారితోషికం భారీగా తగ్గించినట్లు వార్తలొస్తున్నాయి. ప్రధానంగా రష్మిక మందన పారితోషకం ఇప్పుడు 80 లక్షలు నుంచి కోటి రూపాయల వరకు చేసినట్లుగా సమాచారం.

గతంలో ఆమె దాదాపు మూడు నుంచి ఐదు కోట్ల వరకు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆమె పారితోషికం తగ్గించారని... దీనితో ఆమె ఇప్పుడు కాస్త తెలుగుపై అలిగింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. మరి అంత తగ్గించటం ఎంత వరకు సమంజసం అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే స్టార్ హీరోల సినిమాలు అయితే ఎక్కువగానే ఇస్తామని చిన్న హీరోల సినిమాలకు అంత ఇచ్చుకోలేమాని నిర్మాతలు చెబుతున్నారట. అయితే ఇటీవల ఆమెకు అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం చేసేదిలేదని పక్కకు తప్పుకున్న పరిస్థితి ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

కొంత మంది స్టార్ హీరోల సినిమాల విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని టాక్. దీంతో తాను నష్టపోతున్నారని అదే కన్నడంలో సినిమాలు చేసుకుంటే తనకు బాగానే లాభాలు వస్తాయని ఆమె చెబుతున్నట్టుగా తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఆమె తెలుగులో సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి. తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలను కూడా త్వరలోనే ఆమెషూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉండవచ్చని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అనేది త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: