గత కొన్ని రోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోలు హైదరాబాద్ కు ప్రచారం చేస్తారు అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు చాలామంది అసలు ఏ హీరో ప్రచారం చేస్తారు ఏంటి అనే దానిపై ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బలాన్ని మరింత పెంచుకోవడానికి స్టార్ హీరోల ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు సహా కొంతమంది స్టార్ హీరోలను ప్రచారానికి వాడుకునే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

గత కొంతకాలంగా దీనికి సంబంధించి వార్తలు కూడా ఎక్కువగానే వస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రి కేటీఆర్ మహేష్ బాబు తో సమావేశం కూడా అయ్యారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీని వెనుక వాస్తవాలు ఏ విధంగా ఉన్నా సరే హైదరాబాద్ విషయంలో మాత్రం ఇప్పుడు మంత్రి కేటీఆర్, సిఎం కేసీఆర్ హైదరాబాదు జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. మరి ఎలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఉంటాయో చూడాలి. కొన్ని వార్తలు ఏంటి అంటే హైదరాబాద్ విషయంలో ప్రచారం చేయడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు ఉచితంగానే ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది.

దీని ద్వారా హైదరాబాద్ కు ఈ విధంగా పరోక్షంగా సహాయం చేయాలని వారు భావిస్తున్నారు. తమ ప్రమోషన్ కి ఎలాంటి పారితోషికం కూడా ఆశించకుండా ముందుకురావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఒక దర్శకుడితో కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ మాట్లాడినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి హైదరాబాద్ కోసం ఎవరు ప్రచారం చేస్తారు ఏంటి అనేది చూడాలి. ఇంకా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: