బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ అక్టోబర్ 26 వ తేదీన తన 42 వ పుట్టిన రోజున జరుపుకున్నారు. 2000 నుండి 2014 వరకు హృతిక్ రోషన్ తో వైవాహిక బంధం కొనసాగించిన సుసానే ఖాన్ కొన్ని మనస్పర్థల వల్ల విడాకులు తీసుకున్నారు. ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తున్న ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిన్న పుట్టిన రోజు సందర్భంగా లక్షలసంఖ్యలో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మలైకా అరోరా బిపాసాబసు వంటి ప్రముఖ నటీనటులు సుసానే ఖాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే వీళ్లందరి శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపేందుకు సుసానే ఖాన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి కృతజ్ఞతలు తెలిపారు.


"మంచి అవకాశాలను కల్పించినందుకు గాను ఈ జీవితానికి నేను కృతజ్ఞురాలిని. దేవుడు నాకు మంచి స్నేహితులను బంధుమిత్రులను ఇచ్చినందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని ఆమె అన్నారు.


మీ చుట్టూ ఉన్నవారికి నిస్వార్ధంగా సహాయం చేయండి. బంధుమిత్రులకి జాలి, దయ, ప్రేమ చూపించండి అని ఆమె అన్నారు.


అయితే సోషల్ మీడియా వేదికగా సుసానే ఖాన్ పోస్ట్ పెట్టగానే అందరూ స్పందిస్తూ కామెంట్లు, లైక్లు కొట్టారు. ఈ నేపథ్యంలోనే మాజీ భర్త హృతిక్ రోషన్ లవ్ ఇట్ అని కామెంట్ పెట్టి లవ్ సింబల్ జత చేశాడు. దీంతో వారిద్దరి మధ్య ఇంకా స్నేహబంధం దృఢంగానే ఉందని తేలిపోయింది. ఇప్పుడే కాదు గత కొన్ని నెలలుగా వాళ్ళిద్దరు సోషల్ మీడియా వేదికగా తమ స్నేహబంధాన్ని బయట పెడుతూనే ఉన్నారు. ధూమ్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి రెండు అపార్ట్ మెంట్ల ను కొనుగోలు చేశారన్న సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: