బిగ్ బాస్ సీజన్ 4లో హీరోయిన్ మోనాల్ ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. ఆమె మరో హౌజ్ మేట్ అఖిల్ తో సరదాగా ఉండటం అతనితోనే చెట్టాపట్టాలేసుకు తిరగడం జరుగుతుంది. అఖిల్ కోసం మోనాల్.. మోనాల్ కోసమే అఖిల్ అన్నట్టుగా హౌజ్ లో ఆట ఆడుతున్నారు. అయితే రెండు మూడు వారాలు మోనాల్ నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నా అఖిల్ ఫ్యాన్స్ ఆమెను కాపాడుతూ వచ్చారు. ఇక ఇదిలాఉంటే మోనాల్ తన మనసులో ఉన్నది A పేరుగల వ్యక్తి అని అన్నది.

అలా చెప్పింది అఖిల్ గురించి అని అందరికి తెలిసిందే. మోనాల్ ఓ పక్క అఖిల్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నా సరే అవినాష్ ఆమెను పడేయాలని ట్రై చేస్తున్నాడు. సరదాగా ఆటలో భాగమే అయినా మోనాల్ కోసం అవినాష్ చేసే ఓవరాక్షన్ మాములుగా ఉండదు. ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో కూడా అవినాష్ మోనాల్ తో నువ్వు మారిపోయావ్ అని అనగా ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి అవినాష్ నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్తుంది. అవినాష్ పక్కన అరియానా ఉన్నా మోనాల్ అతనికి ముద్దు పెట్టింది.

అయితే అప్పుడు అవినాష్ మోనాల్ దృష్టిలో A అంటే అవినాష్ అని అరిచి నా పొలంలో మొలకలొచ్చాయ్ అని అంటాడు. బిగ్ బాస్ వెంటనే నువ్వొస్తానంటే నేఒద్దంటానా సాంగ్ వేశాడు. మొత్తానికి హౌజ్ లో అవినాష్ చేయాల్సిన ఫన్ అంతా చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మోనాల్ మనసులో ఉన్న A పేరు గల వ్యక్తి ఎవరన్నది అందరికి తెలిసిందే. కాని అవినాష్, అభిజిత్ లు కూడా A లెటర్ తోనే పేర్లు స్టార్ట్ అవడం వల్ల కన్ ఫ్యూజన్ ఏర్పడుతుంది.

 




మరింత సమాచారం తెలుసుకోండి: