డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాధ్ డైరక్టర్ గానే కాదు నిర్మాతగా కూడా బెస్ట్ అనిపించుకున్నారు. ప్రస్తుతం పూరీ నిర్మాతగా తనయుడు ఆకాష్ పూరీ హీరోగా వస్తున్న సినిమా రొమాంటిక్. ఈ సినిమాను అనీల్ పాడూరి డైరెక్ట్ చేస్తున్నారు. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమాను ఓటిటి రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

ఆకాష్ పూరీ, కెతిక శర్మ కలిసి నటిస్తున్న ఈ సినిమా యూత్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే థియేటర్ రిలీజ్ అంటే మరో మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే. అందుకే రొమాంటిక్ టీం ఓటిటికి ఓటు వేసినట్టు తెలుస్తుంది. ఓటిటిలో రొమాంటిక్ రచ్చ చేస్తుందని టాక్. ఎందుకంటే ఓటిటి వెబ్ సీరీస్ లు కూడా అడల్ట్ కంటెంట్ తో వస్తున్నాయి. అందుకే రొమాంటిక్ మూవీని కూడా ఓటిటి రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారట.

త్వరలోనే రొమాంటిక్ రిలీజ్ డేట్ రివీల్ చేస్తారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఓటిటిలో సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. కెతిక శర్మ అందాలు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని తెలుస్తుంది. ఆకాష్ పూరీ, కెతిక శర్మల రొమాన్స్ యువతను ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తుంది. మెహబూబా సినిమాతో పూరీ డైరక్షన్ లో సినిమాతో హీరోగా హిట్టు కొట్టాలని చూసిన ఆకాష్ పూరీ ఈసారి టార్గెట్ గట్టిగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. రొమాంటిక్ పక్కా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.                                                                

మరింత సమాచారం తెలుసుకోండి: